ఎన్‌సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ( Maharashtra Baba Siddiqui )హత్య, బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ( Superstar Salman Khan )ఇంటి వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన సూత్రదారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అన్మోల్ బిష్ణోయ్ ప్రస్తుతం యూఎస్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల కస్టడీలో ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.ప్రస్తుతం అతను అయోవాలోని జైలులో ఉన్నాడు.
యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వెబ్‌సైట్ అప్‌డేట్ ప్రకారం.అన్మోల్ బిష్ణోయ్ అయోవాలోని పొట్టవట్టమీ కౌంటీ జైలులో ఉన్నాడు.
అయితే అతనికి సంబంధించిన మిగిలిన వివరాలు అందుబాటులో లేవు.
కెనడాలో( Canada ) నివసిస్తూ.
అమెరికాకు నిత్య రాకపోకలు సాగిస్తున్నాడు అన్మోల్(Anmol ).జైలులో ఉన్నప్పటికీ గ్లోబల్ క్రిమినల్ సిండికేట్‌ను నడుపుతున్న అన్న లారెన్స్ బిష్ణోయ్ ఆదేశాలను ఇతను అమలు చేస్తున్నట్లుగా భద్రతా దళాలు చెబుతున్నాయి.గత నెలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య సహా పలు క్రిమినల్ కేసుల్లో అన్మోల్ వాంటెడ్‌గా ఉన్నాడు.ఈ ఏడాది ఏప్రిల్ 14న బాంద్రా ప్రాంతంలో ఉన్న బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరపడం వెనుక కూడా ఇతని హస్తం ఉందని పోలీసులు చెబుతున్నారు.
అన్మోల్‌ను అప్పగించాలని ఇప్పటికే భారత ప్రభుత్వం కెనడా, అమెరికాలను కోరింది.జాతీయ దర్యాప్తు సంస్థ ( National Investigation Agency )(ఎన్ఐఏ) కూడా ఇటీవలే అన్మోల్ ఆచూకీపై సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డ్‌ను ప్రకటించింది.ఈ వారం ప్రారంభంలో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అన్మోల్‌ను బహిష్కరించే అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.
ఈ విషయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ, ఎఫ్‌బీఐ అధికార పరిధిలోకి వస్తుందని తెలిపింది.
సల్మాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటన తర్వాత ఏప్రిల్‌లో అన్మోల్‌పై లుకౌట్ సర్క్యూలర్ జారీ చేశారు పోలీసులు.కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో నిధుల సేకరణ, ఉగ్రవాద చర్యలకు యువతను రిక్రూట్ చేసుకోవడం వంటి కుట్రలలో భాగమైనందుకు గాను 2022 ఆగస్టులో బిష్ణోయ్ సోదరులు సహా 9 మందిపై ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.అన్మోల్‌ను తమకు అప్పగించాలని అమెరికా ప్రభుత్వాన్ని భారత్ కోరినప్పటికీ.
ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడాకు తొలుత అతనిని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.