నల్లగా నిగనిగలాడే నేరేడు పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు.కాస్త వగరు, కాస్త తీపి, కాస్త పులుపు రుచులతో ఉండే నేరేడు పండ్లు తింటే ఎన్నో ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే నేరుడు పండు వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుతం కరోనా సమయంలో శరీర రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో నేరేడు అద్భుతంగా సహాయపడుతుంది.ఎందుకంటే, నేరేడు పుష్కలంగా లభించే విటమిన్ సి.శక్తివంతమైన యాంటి ఆక్సిడెంటుగా పనిచేసి.శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపడేలా చేస్తుంది.
అలాగే మధుమేహం ఉన్న వారికి నేరేడు ఔషదంలా పని చేస్తుంది.మధుమేహ రోగులు నేరేడు పండ్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటే నేరేడు పండ్లు తినడం వల్ల.శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడడంతో పాటు గుండె జబ్బులు రాకుండా రక్షణ లభిస్తుంది.ఇక చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు.అలాంటి వారు నేరేడు పండ్లు తినడం వల్ల శరీరంలో హైడ్రేట్ అవుతుంది.
అలాగే క్యాల్షియం, పాస్పరస్, మాంగనీస్, జింక్, సోడియం లభించే నేరేడు పండ్లు తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.అదేవిధంగా, కిడ్నీలో రాళ్లు, ఇతర కిడ్నీ సమస్యలను దూరం చేయడంలోనూ నేరేడు పండ్లు ఉపయోగపడతాయి.
ఇక నేరేడు పండ్లు తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో కేన్సర్ కారకాలు వృద్ది చెందకుండా రక్షిస్తుంది.నేరేడు పండ్ల వల్ల మరో అద్భుత ప్రయోజనం ఏంటంటే.జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.ముఖ్యంగా గ్యాస్, మలబద్ధం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.