సాధారణంగా కొందరి పాదాలు తరచూ పగిలిపోతూ ఉంటాయి.ఈ పగుళ్ల వల్ల తీవ్ర నొప్పి పుట్టడమే కాదు.
నడిచేటప్పుడు అసౌకర్యంగా కూడా ఉంటుంది.శరీర వేడి, పాదాలకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆహారపు అలవాట్లు, గంటల తరబడి నిలబడటం ఇలా రకరకాల కారణాల పాదాల పగుళ్లు ఏర్పడతాయి.
అయితే వీటిని తగ్గించుకునేందుకు ఏవేవో క్రీములు, ఆయిల్స్ రాస్తూ నానా తంటాలు పడుతుంటారు.అయితే పాదాల పగుళ్లను నివారించడంలో బొప్పాయి అద్భుతంగా సహాయపడుతుంది.
మరి బొప్పాయిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బాగా పండిన బొప్పాయి పండు నుంచి గుజ్జు తీసుకోవాలి.
ఇప్పుడు ఆ బొప్పాయి గుజ్జులో కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసి పాదాలకు అప్లై చేయాలి.ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాదాలను డ్రై అవ్వనిచ్చి అనంతరం గోరు వెచ్చని నీటితో పాదాలను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే క్రమంగా పాదాల పగుళ్లు మటుమాయం అవుతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో బొప్పాయి పండు గుజ్జు, కలబంద గుజ్జు మరియు నిమ్మ రసం వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పాదాలకు పూసి అర గంట పాటు వదిలేయాలి.ఇప్పుడు చల్లటి నీటితో పాదాలకు వాష్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే.పగుళ్లు తగ్గి పాదాలు మృదువుగా, అందంగా మారతాయి.
ఇక బొప్పాయి పండు గుజ్జులో తేనె యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పగిలిన పాదాలకు అప్లై చేసి పావు గంట పాటు ఆరనివ్వాలి.
ఆనంతరం గోరు వెచ్చని నీటితో పాదాలను క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా కూడా పాదాల పగుళ్లు క్రమంగా తగ్గు ముఖం పడతాయి.