చంద్ర మోహన్.ఈ తరం వాళ్లకు ఆయన కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే తెలుసు.
కానీ నిజానికి ఆయన ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన వ్యక్తి.ఆయనకు పెద్ద స్టార్ హీరోలతో ఢీ కొట్టారు.
నటన మీద ఉన్న మక్కువ ఆయనను నాటకాల నుంచి సినిమా తెరపై మెరిపించింది.తెలుగు చిత్రసీమలో ఇప్పుడున్న విలక్షణ నటుల్లో అరుదైన నటుడాయన.
తన నటనకు ఎన్నో అవార్డులు.మరెన్నో రివార్డులు ఆయనను వరించాయి.1945లో జన్మించిన చంద్రమోహన్ మే 23తో 76వ వసంతంలోకి అడుగుపెట్టారు.కొన్నేళ్లుగా తన పుట్టినరోజు వేడుకలు దాదాపు సినిమా సెట్లోనే జరుగుతూ వస్తున్నాయి.
ఈసారి లాక్‌డౌన్ కావడం వల్ల వాట్సాప్ వీడియో కాల్స్ తో పెట్టుకున్నాడు చంద్ర మోహన్.ఆయన సతీమణి జలంధర.ఆమె తెలుగు వాళ్లందరికీ తెలుసు.చాలా మంచి రచయిత్రి.
ఎన్నో మంచి కథలు, నవలలు రాసింది.ఈయనకు కోపమెంత ఎక్కువో ఆమెకు సహనం అంత ఎక్కువ.
వీరికి ఇద్దరమ్మాయిలు.పిల్లల పెంపకం, వాళ్ల చదువులు, ఇంటి వ్యవహారాలు అన్నీ ఆయన భార్యే చూసుకుంది.
అటు ఇండస్ట్రీలో కమెడియన్ నిలదొక్కుకోవాలంటే అతనికి డైలాగ్ లో పంచ్, మోటివేషన్ ఉండాలి.ముఖ్యంగా జనం నాడి తెలుసుకోవాలి.సన్నివేశంలో ఇతర ఆర్టిస్టులను డామినేట్ చేయకూడదు.మన మూడ్, పరిస్థితితో సంబంధం లేకుండా నటించాలి.
ప్రేక్షకులు ప్రతి కమెడియన్ నుంచి ప్రతిసారి కొత్తదనం కోరుకుంటారు.మంచి దర్శకుల దగ్గర శిక్షణ, అబ్జర్వేషన్, మా ఫ్యామిలీలో మేం నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉండటం ఇవన్నీ తన కమెడియన్ పాత్రలకు దోహదం చేశాయంటారు ఆయన.

దాదాపు హీరో, కమెడియన్‌గా మాత్రమే తెలిసిన చంద్రమోహన్ ప్రతినాయకుడిగానూ మెప్పించారు. గంగ మంగతో పాటు జయసుధ నటించిన లక్ష్మణరేఖలో ఆయనది నెగెటివ్ రోల్.హీరోగా మాత్రమే చేయాలని అనుకుంటే ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉండేవాడిని కాదంటారు ఆయన.ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఆల్ రౌండర్ కాక తప్పదు.దాదాపు 50 సంవత్సరాలు నిర్విరామంగా పని చేశాను.నా ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేశా.ఎవరైనా హెచ్చరించినా పట్టించుకోలేదన్నాడు.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ప్పుడు తెలుస్తోంది అంటాడు చంద్ర మోహన్.