టాలీవుడ్ ప్రముఖ రచయిత కె.వి విజయేంద్ర ప్రసాద్( K Vijayendra Prasad ) గురించి మనందరికి తెలిసిందే.
విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి(
Rajamouli ) తండ్రి అన్న విషయం అందరికీ తెలిసిందే.రాజమౌళి సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తారనే సంగతి తెలిసిందే. ‘స్టూడెంట్ నెం.1, మర్యాద రామన్న వంటి రెండు మూడు చిత్రాలు తప్పా మిగిలిన సినిమాలకు ఆయనే స్టోరీలు రాశారు.తెర మీద మనకు రాజమౌళి మాత్రమే కనిపిస్తారు.కానీ తెర వెనుక ఉండి అంత నడిపించేది మాత్రం విజయేంద్ర ప్రసాద్ అని చెప్పాలి.

సినిమాలు సక్సెస్ అవ్వడానికి అన్నింటికీ మూల కారణం కూడా ఆయనే అని చెప్పాలి.రాజమౌళి సక్సెస్ లో కీలక పాత్ర పోషించేది ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ అని చెప్పాలి.సినిమాలకు కథ మొత్తం ఆయన రాస్తే నడిపించేది మాత్రం రాజమౌళినే.తెలివిగా ఉండి కథను రాస్తూ ఉంటారు కాబట్టి చాలామందికి ఆయన గురించి తెలియదు.ఇది ఇలా ఉంటే ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్( Dr BR Ambedkar ) గురించి మాట్లాడారు.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.అంబేద్కర్ దానికి అర్హుడు.ఇండిపెండెన్స్ తర్వాత గ్రేటెస్ట్ పర్సన్ ఎవరు? అని 2012లో ఒక ఛానల్ సర్వే నిర్వహించింది.ఇందులో 20 లక్షల మంది పాల్గొన్నారు.స్వాతంత్య్రం తర్వాత భారతదేశంలో అతి గొప్ప వ్యక్తి ఎవరు? అని అడిగితే ఈ సర్వేలో అంబేద్కర్ గారు ఫస్ట్ వచ్చారు.

అబ్దుల్ కలాం( Abdul Kalam ) గారు సెకండ్ ప్లేస్ లో వచ్చారు అని తెలిపారు.అంబేద్కర్ గురించి రీసెర్చ్ చేసి నా ఇంట్లో ఫోటో పెట్టుకోలేదు.ఆయనంటే నాకు ఇష్టం.ఎందుకు ఇష్టమో నాకు కూడా తెలియదు.రీసెర్చ్ చేసిన తరువాత అన్ని రకాలుగా ఆయన అర్హుడనే విషయం అర్థమైంది అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరికొందరు నెగిటివ్గా స్పందిస్తున్నారు.