మన ఇంట్లో వంటగదిలో ఉండే పదార్ధాలతో అనేక రకాల రోగాలు రాకుండా లేదా వచ్చిన వాటికి రోగాలని తగ్గించుకోడానికి చిన్న చిన్న చిట్కాలతో పరిష్కరించుకోవచ్చు.సాధారణంగా మిరియాలని చాలా మంది తినడానికి ఇష్టపడరు.
కారణం అవి చాలా ఘాటుగా ఉంటాయి.కానీ అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అలాగే నిత్యం మనం పూజించే తులసి ఆకులు కూడా మన ఆరోగ్య సంరక్షణలో చాలా బాగా ఉపయోగపడుతాయి.ఆరోగ్య పరిరక్షణలో మిరియాలు, తులసి ఆకుల్ని ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం.
కఫం మనలో చాలా మంది ఈ సమస్యతో భాదపడుతుంటాడు.అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు కానీ చారులో మిరియాల పొడి వేసి, దానిలో నెయ్యి తో పోపు పెట్టి.
భోజనం చేస్తే కఫం తగ్గుతుంది.అలాగే జలుబు ఉన్న వాళ్ళు ప్రతీ రోజు ఉదయం కొన్ని తులసి ఆకుల్ని తీసుకుని వాటిని దంచి కషాయంగా కాచాలి,ఆ కషాయంలో ఒక స్పూన్ తేనే కలిపి తాగితే జలుబు తగ్గుతుంది.
మిరియాల పొడి,బెల్లంపెరుగు కలిపిన మిశ్రమాన్ని పడుకునే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది.పసుపు కొమ్ముల్ని కాల్చి దాని పొగని పీల్చినా ,లేక ఆరువేల్లుల్లి గ్రాముల రసం బెల్లంతో కలిపి తిన్నాసరే .ఉసిరిపొడి ,శొంటి ,పిప్పల్లి ,మిరియాల పొడి,వీటన్నింటినీ కలిపి రొజూ తీసుకుంటే కఫం తగ్గుతుంది.ఈ చిట్కాని జబ్బు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు…ఇలా తీసుకోవడం వలన ముందుగానే ఇటువంటి సమస్యలని రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.