ఐబ్రోస్ ఒత్తుగా పెర‌గాలా ? అయితే ఖ‌ర్జూరం విత్త‌నాల‌తో ఇలా చేయండి!

ఐబ్రోస్ ఒత్తుగా ఉంటే ముఖం మ‌రింత ప్ర‌కాశ వంతంగా క‌నిపిస్తుంది.అందు వ‌ల్ల‌నే ఒత్తైన ఐబ్రోస్ కావాల‌ని ప్ర‌తి అమ్మాయి కోరుకుంటుంది.

 Date Seeds Help To Increase Eyebrow Growth! Date Seeds, Eyebrows Growth, Eyebrow-TeluguStop.com

కానీ, అంద‌రికీ థిక్ ఐబ్రోస్ ఉండ‌టం అసాధ్యం.అందుకే ప‌ల్చ‌టి ఐబ్రోస్ ఉన్న వారు.

వాటిని థిక్‌గా మార్చుకునేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు.అయితే ఐబ్రోస్‌ను స‌హ‌జంగానే ఒత్తుగా మార్చ‌డంలో ఖ‌ర్జూరం విత్త‌నాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆల‌స్య‌మెందుకు ఖ‌ర్జూరం విత్త‌నాల‌ను క‌ను బొమ్మ‌ల‌కు ఎలా వాడాలో చూసేయండి.

ముందుగా ఖ‌ర్జూరం పండ్ల నుంచి విత్త‌నాల‌ను సేక‌రించాలి.

ఇప్పుడు స్ట‌వ్‌పై ఒక మంద‌పాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక క‌ప్పు ఖ‌ర్జూరం విత్త‌నాలు, ప‌ది బాదం ప‌ప్పులు, ప‌దిహేను ల‌వంగాలు వేసి బాగా న‌ల్ల‌గా మారే వ‌ర‌కు డ్రై రోస్ట్ చేసుకోవాలి.ఆపై చ‌ల్లార బెట్టుకుని మిక్సీలో మెత్త‌గా పొడి చేసుకోవాలి.

అనంత‌రం ఈ పొడిని ఒక డ‌బ్బాలో స్టోర్ చేసుకుంటే.రెండు నుంచి మూడు నెల‌ల పాటు నిల్వ ఉంటుంది.

ఇక ఈ పొడిని క‌ను బొమ్మల‌కు ఎలా వాడాలంటే.ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ త‌యారు చేసుకున్న పొడి, మూడు స్పూన్ల ఆముదం వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ను బొమ్మ‌ల‌కు మ‌రియు కావాల‌నుకుంటే క‌ను రెప్ప‌ల‌కు అప్లై చేసుకోవాలి.ప్ర‌తి రోజూ నైట్ నిద్రించే ముందు ఈ మిశ్ర‌మాన్ని రాసుకుని.ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో స్మూత్‌గా శుభ్రం చేసుకోవాలి.ఇలా చేస్తే కొద్ది రోజుల‌కే ఐబ్రోస్ ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతాయి .

ఇక ఐబ్రోస్ ఒత్తుగా పెర‌గాలంటే పైన చెప్పుకున్న‌ టిప్‌తో పాటుగా మ‌రికొన్ని జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.ముఖ్యంగా కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే ఐ మేక‌ప్ ప్రోడెక్ట్స్‌ను ఎవైడ్ చేయాలి.

ఎగ్స్, అవకాడో, సాల్మన్, పీనట్స్ వంటి ఆహారాల్లో ఐబ్రోస్ పెరిగేందుకు అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్స్ ఉంటాయి.కాబ‌ట్టి, వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.మ‌రియు ఐబ్రోస్ ని రెగ్యులర్ గా మసాజ్ చేసుకుంటూ ఉంటే ఒత్తుగా పెరుగుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube