కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అక్కడ స్టార్ ప్రొడ్యూసర్ కె.యి జ్ఞానవెల్ రాజా మీద కేస్ ఫైల్ చేశారు.
జ్ఞానవెల్ రాజా నిర్మాతగా శివ కార్తికేయన్ హీరోగా 2019లో మిస్టర్ లోకల్ సినిమా వచ్చింది.ఆ సినిమా కోసం శివ కార్తికేయన్ కి 15 కోట్లు ఇస్తానని చెప్పిన నిర్మాత జ్ఞానవెల్ రాజా 11 కోట్లు మాత్రమే ఇచ్చారని.
ఇంకా 4 కోట్లు పెండింగ్ ఉండగా.బ్యాలెన్స్ ఎమౌంట్ కోసం ఎన్నిసార్లు అడిగినా సరే నిర్మాత నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట.
అంతేకాదు తనకు ఇచ్చిన 11 కోట్లకు కూడా టీ.డీ.ఎస్ పే చేయకపోవడంతో వాటికి గాను 91 లక్షల దాకా కట్ అయ్యాయని శివ కార్తికేయన్ చెబుతున్నారు.
తమ కేసు పరిష్కారం అయ్యే వరకు జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న రెబల్, విక్రం 61, పాతు తాల సినిమాలపై ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
నిర్మాత, హీరోల మధ్య ఈ గొడవ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈమధ్యనే డాక్టర్ సినిమాతో హిట్ అందుకున్న శివ కార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా డాన్ ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నారు.
ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.