న్యూస్ రౌండప్ టాప్ 20

1.బీఆర్ఎస్ గా టిఆర్ఎస్

టిఆర్ఎస్ పార్టీని బీఆర్ ఎస్ పార్టీగా మారుస్తూ, ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. 

2.దేశ ప్రజల కోసమే బీఆర్ ఎస్

  దేశ ప్రజల కోసమే టిఆర్ఎస్ ను ఏర్పాటు చేశామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

3.నేడు భద్రాద్రి సీతారాముల పట్టాభిషేకం

 

అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 

4.పీజీ వైద్య విద్య ప్రవేశాల ప్రకటన

  పీజీ వైద్య విద్య కన్వీనర్ కోట సీట్ల భర్తీకి ఆరు వరకు వెబ్ ఆప్షన్ లకు అవకాశం కల్పిస్తూ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

5.టిఆర్ఎస్ లో చేరిన టిపిసిసి అధికార ప్రతినిధి

 

టిపిసిసి అధికార ప్రతినిధి తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్ టిఆర్ఎస్ లో చేరారు. 

6.కెసిఆర్ జాతీయ పార్టీకి మద్దతు

  సీఎం కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలుగు రాష్ట్రాల్లోని వైఎంసిఏ శాఖల ప్రతినిధులు ప్రకటించారు. 

7.  ఢిల్లీకి షర్మిల

 

Advertisement

రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ అవినీతి అక్రమాలపై సిబిఐ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయడానికి రేపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీ వెళ్ళనున్నారు. 

8.గవర్నర్ సీఎం దసరా శుభాకాంక్షలు

  విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళ సై సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 

9.రేపటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

 

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే బియ్యాన్ని ఈనెల 6వ తేదీ నుంచి పంపిణీ చేయాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. 

10.టిఆర్ఎస్ పై దిగ్విజయ్ సింగ్ కామెంట్స్

 బిజెపి నుంచి దేశానికి ముప్పు పొంచి ఉన్నట్లయితే తెలంగాణకు టిఆర్ఎస్ నుంచి ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ జాతీయ నాయకులు జైరాం రమేష్,  దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. 

11.పాలమూరుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేం

 

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది. 

12.షర్మిల వ్యాఖ్యలపై జర్నలిస్టుల నిరసన

  టీయూ డబ్ల్యు జే , టీజేఎఫ్ గౌరవ సలహాదారు , ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై వైయస్సార్ టిడిపి అధ్యక్షురాలు షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నిరసిస్తూ భూపాలపల్లి లోని జయశంకర్ చౌరస్తాలో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. 

13.ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

 

తెలుగు రాష్ట్రాల ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. 

14.ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు

  ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనార్థం భక్తులు కోటేత్తారు రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇచ్చారు. 

15.ద్వారకాతిరుమలలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

 

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో బుధవారం ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈనెల 12వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. 

16.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

  తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.నిన్న తిరుమల శ్రీవారిని 68,539 మంది భక్తులు దర్శించుకున్నారు. 

17.దుర్గమ్మ ను దర్శించుకున్న బాలకృష్ణ

 

Advertisement

సినీ నటుడు హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

18.నేడు దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు

  దేవరగట్టులో బుధవారం బన్నీ ఉత్సవాలు జరగనున్నాయి. 

19.నేడు ఢిల్లీలో రావణ దహనం

 

నేడు రామ్ లీల మైదానంలో రావణ దహనం కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది మూర్ము ఢిల్లీ సీఎం కేజీ హీరో ప్రభాస్ హాజరు కానున్నారు. 

20.టిడిపి ఆధ్వర్యంలో పాదయాత్ర

  నేటి నుంచి జగ్గంపేట నియోజకవర్గంలో టిడిపి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నారు ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నట్లు టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు.

తాజా వార్తలు