కొంత మందిలో శరీరం వాపులా వచ్చి ఉబ్బినట్టు కన్పిస్తుంది.ఎలా ఎందుకు వస్తుందో తెలుసా ? శరీరంలో మోతాదుకు మించి నీరు ఉన్నప్పుడు ఉబ్బినట్టు మరియు వాపులు కనిపిస్తాయి.శరీరంలో నీటిని తగ్గించుకోవటానికి ఎటువంటి మందులను వాడవలసిన అవసరం లేదు.ఎందుకంటే సహజసిద్ధమైన చిట్కాలతో సులభంగా శరీరంలో ఎక్కువగా ఉన్న నీటిని తొలగించుకోవచ్చు.ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఉప్పులో ఉండే సోడియం శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేస్తుంది.
కాబట్టి ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే శరీరంలో నీరు తగ్గిపోతుంది.
శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటకు పంపటంలో విటమిన్ బి6 బాగా సహాయపడుతుంది.
అందువల్ల బి6 సమృద్ధిగా ఉండే పిస్తా పప్పు, చేపలు, అరటి పండ్లు, డ్రై ఫ్రూట్స్, పాలకూర వంటి ఆహారాలను తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు పోతుంది.
శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటకు పంపటంలో పొటాషియం కూడా బాగా సహాయాపడుతుంది.
అందువల్ల పొటాషియం సమృద్ధిగా ఉండే అరటి పండ్లు, అవకాడోలు, బీన్స్, పాలకూర వంటి ఆహారాలను తీసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు పోతుంది.
నట్స్, ఆకుపచ్చని కూరగాయల వంటి మెగ్నిషియం ఎక్కువగా ఉండే ఆహారాన్నితీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
శరీరానికి అవసరమైన నీటిని త్రాగకపోయిన శరీరం ఉబ్బినట్టు కన్పిస్తుంది.అందువల్ల శరీరానికి అవసరమైన నీటిని రోజుకి 7 గ్లాసులు త్రాగాలి.
చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేస్తాయి.అందువల్ల ఆ ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది.
శరీరంలో అధికంగా ఉన్న నీటిని బయటకు పంపటంలో వెల్లుల్లి బాగా సహాయపడుతుంది.అందువల్ల రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని భాగంగా చేసుకుంటే మంచిది.
జీలకర్రను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో అధికంగా ఉన్న నీరు బయటకు పోతుంది.