1.’తానా ‘ పుస్తక మహోత్సవం
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన ‘ పుస్తక మహోద్యమాన్ని ‘ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రారంభించారు.
2.కువైట్ లో కొత్త నిబంధన.భారత కార్మికులకు ఇబ్బంది
గల్ఫ్ దేశం కువైట్ రోజుకో కొత్త నిబంధనలు విధిస్తూ వలసదారులకు చుక్కలు చూపిస్తుంది.తాజాగా మరో కొత్త నిబంధనను తెరపైకి తీసుకు వచ్చింది.ఇకపై 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న వారిని మాత్రమే నిర్మించుకోవాలనే నిబంధన పెట్టింది.అంతే కాదు ఇక నేరుగా యజమానులు జీతాలు చెల్లించకుండా , యజమాని పేరు మీద తప్పకుండా ఓ బ్యాంకు ఖాతా తెరిచి అందులో జీతం వేయాలని నిబంధన విధించారు.
3.కువైట్ సంచలన నిర్ణయం
కువైట్ లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి ఎటువంటి కరోనా ఆంక్షలు లేవని ప్రకటించింది.
4.తైవాన్ రక్షణ కోసం రంగంలోకి అమెరికా
తైవాన్ పై చైనా దాడి చేస్తే తైవాన్ కు అండగా నిలబడతాము అని అమెరికా ప్రకటించింది.
5.రష్యాలో భారీ పేలుడు .16 మంది మృతి
రష్యాలో భారీ పేలుడు సంభవించింది ప్రమాదం 16 మంది మృతి చెందారు.
6.దుబాయ్ బూర్జ్ ఖలీఫా పై బతుకమ్మ ప్రదర్శన
తెలంగాణ ప్రసిద్ధమైన బతుకమ్మ పండుగ ను రేపు దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ ను ప్రదర్శించనున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు.
7.అలస్కా లో భారత సైనికుల విన్యాసాలు
భారత అమెరికా సైనికులు యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్నారు.అలస్కా లో జరుగుతున్న ఈ విన్యాసాల్లో భారతీయ ఆర్మీకి చెందిన సైనికులు విన్యాసాల్లో పాల్గొంటున్నారు.
8.గ్రే జాబితా లోనే పాకిస్తాన్
అంతర్జాతీయ ఆర్థిక సహాయం పొందే విషయంలో పాకిస్తాన్ కు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది.ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో నిర్వహించిన మూడు రోజుల ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాకిస్తాన్ ను ఏప్రిల్ 2022 వరకు గ్రే లిస్టు లోనే ఉంచాలని నిర్ణయించారు.
9.బ్రిటన్ లో పెరుగుతున్న కరోనా
బ్రిటన్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.కొత్తగా 52 ,009 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
10.కొరియాతో భేటీకి అమెరికా సిద్ధం
ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా ఉత్తర కొరియా తో భేటీ అయ్యేందుకు అమెరికా ముందుకొచ్చింది.