పైసా ఖర్చు లేకుండా ఈ హోమ్ మేడ్ టోనర్ తో చర్మాన్ని తెల్లగా మార్చుకోండి!

చాలా మంది చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన క్రీమ్, సీరం తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.స్కిన్ వైట్నింగ్ కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.

 Whiten Skin With This Homemade Toner Without Spending A Money! Homemade Toner, F-TeluguStop.com

కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా మరియు వేగంగా చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ టోనర్ సూపర్ ఎఫెక్టివ్‌ గా హెల్ప్ చేస్తుంది.

మరి ఇంతకీ ఆ హోమ్ మేడ్ ఫేస్ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్‌ తొలగించి వాట‌ర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అరటిపండు తీసుకుని తొక్క తొలగించి స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అరటిపండు స్లైసెస్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Face, Homemade, Latest, Skin Care, Skin Care Tips, Skin-Telugu Heal

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన ఫేస్ టోనర్ సిద్ధ‌మవుతుంది.ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

Telugu Tips, Face, Homemade, Latest, Skin Care, Skin Care Tips, Skin-Telugu Heal

రోజుకు రెండుసార్లు త‌యారు చేసుకున్న ఫేస్ టోన‌ర్ ను ముఖానికి స్ప్రే చేసుకోవాలి.గంట అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఈ హోమ్‌ మేడ్ ఫేస్ టోనర్ ను వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.అలాగే ఈ ఫేస్ టోనర్ ను వాడటం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

కాబట్టి స్కిన్ వైటింగ్ కోసం ఆరాట‌పడుతున్నవారు ఇంట్లోనే సహజ పద్ధతిలో చర్మాన్ని ఇలా తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube