దాదాపు వేసవికాలం దగ్గరికి వచ్చేసింది.ఈ ఎండాకాలంలో శరీరం డిహైడ్రేషన్ కు ఎక్కువగా గురవుతూ ఉంటుంది.
అలాగే శరీరంలోని నీటి కొరతను తగ్గించేందుకు చాలామంది సమ్మర్ సీజన్లో పుచ్చకాయను (Watermelon)తింటూ ఉంటారు.ఎందుకంటే పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది.
అయితే ఈ వాటర్ మిలన్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.అలాగే పుచ్చకాయ గింజలను(watermelon seeds) తీసుకోవడం వల్ల అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
ఎందుకంటే పుచ్చకాయ గింజలలో ఖనిజాలు, విటమిన్లు, జింక్, మంచి కొవ్వులు, మెగ్నీషియం, పొటాషియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉన్నాయి.అంతేకాకుండా పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఎన్నో అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి.
వీటిని పచ్చిగా లేదా వేయించి తినవచ్చు.పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
అందుకే ఇది చర్మానికి కూడా మంచి నిగారింపు ఇస్తుంది.మొటిమలు, వృద్ధాప్య సమస్యలు రాకుండా దూరం చేస్తుంది.

పుచ్చకాయ గింజలు ప్రోటీన్లు, ఐరన్, మెగ్నీషియమ్, జింక్, రాగితో నిండి ఉంటాయి.అందువలన ఇది జుట్టు(Hair) రాలకుండా కాపాడుతుంది.అంతేకాకుండా డాండ్రఫ్ ని కూడా అరికడుతుంది.జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది.అలాగే పుచ్చకాయ గింజలలో మోనోఅన్ శ్యాచురేటెడ్ అలాగే పాలి అండ్ శ్యాచురేటెడ్, ఫ్యాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి.అందుచేత ఇది బీపీని అదుపులో ఉంచుతుంది.
అదేవిధంగా పుచ్చకాయ గింజలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ను తినడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు (diabetics)మంచి ఫలితం ఉంటుంది.ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.అలాగే వాటర్ మిలన్ సీడ్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అదేవిధంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ కూడా పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.అంతేకాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
అదేవిధంగా జీవక్రియను మెరుగుపరుస్తాయి.







