సాధారణంగా బియ్యం ఉడికించిన తర్వాత వచ్చే వాటర్ ను చాలా మంది పారబోసేస్తుంటారు.కానీ ఆ రైస్ వాటర్ లో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అవి మన చర్మ సౌందర్యానికి ఎంతగానో సహాయపడతాయి.ముఖ్యంగా ఈ రైస్ వాటర్ తో ఇప్పుడు చెప్పబోయే విధంగా సీరం తయారు చేసుకుని రోజు వాడితే మీరు ఊహించని ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం రైస్ వాటర్ తో సీరం ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ ను వేసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే కడిగి పెట్టుకుని ఒక కప్పు రైస్ ను వేసి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై రైస్ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ పూర్తిగా చల్లారే లోపు ఒక టమాటో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజలు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక ఆరెంజ్ పండుకు ఉన్న తొక్కను కూడా సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు మరియు ఆరెంజ్ తొక్కలు వేసుకోవాలి.ఆపై ఒక గ్లాస్ రైస్ వాటర్ ను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో మూడు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

అంతే మన సీరం సిద్ధమవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ సీరంను ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని పడుకోవాలి.మరుసటి రోజు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ సీరం ను వాడటం వల్ల స్కిన్ టోన్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.
స్కిన్ గ్లోయింగ్ గా షైనీ గా మెరిసిపోతుంది.డార్క్ సర్కిల్స్ ఉన్నా సరే క్రమంగా తగ్గు ముఖం పడతాయి.