గ్యాస్ నొప్పి అనేది ప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చే ఒక సాదారణ విషయం.గ్యాస్ నొప్పి ఎక్కువ అయినప్పుడు గుండె నొప్పి అని తప్పుడు సంకేతాలను ఇస్తుంది.
కొన్ని సార్లు మనం తీసుకొనే ఆహారం ద్వారా గ్యాస్ ఏర్పడి మలబద్ధకం లేదా అతిసారంనకు దారితీస్తుంది.అందువల్ల ఇప్పుడు గ్యాస్ నొప్పి తొందరగా తగ్గటానికి ఇంటి చిట్కాలు తెలుసుకుందాం.
1.కింద పడుకోవాలి
గ్యాస్ నొప్పి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది.అందువల్ల ఆ సమయంలో
కింద పడుకోవాలి.ఆ విధంగా కొంత సమయం విశ్రాంతి తీసుకుంటే అసౌకర్యం
తగ్గుతుంది.
2.ద్రవాలను తీసుకోవాలి
జీర్ణక్రియ సరిగ్గా లేకపోవుట వలన గ్యాస్ వస్తుంది.ద్రవాలను ఎక్కువగా
తీసుకుంటే జీర్ణం కానీ ఆహారాలను తరలించటానికి సహాయపడుతుంది.ద్రవాలు
ఎక్కువగా తీసుకోవటం వలన మలబద్ధకం తగ్గి తద్వారా గ్యాస్ బయటకు పోతుంది.
3.వేడి ద్రవాలను తీసుకోవాలి
వేడి ద్రవాలను తీసుకోవటం వలన పొత్తికడుపు ప్రాంతంలో గ్యాస్ తయారవదు.వేడి నీరు లేదా టీ తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా గ్యాస్
సహజంగా బయటకు వెళ్ళటానికి సహాయపడుతుంది.
4.పండ్లను తినాలి
జీర్ణ వ్యవస్థలో వేడి మరియు గ్యాస్ తయారవ్వకుండా నిరోదించే కొన్ని పండ్లు
ఉన్నాయి.బొప్పాయి కడుపు ఉబ్బరం తగ్గటానికి సహాయపడుతుంది.
5.బేకింగ్ సోడా
ఒక కప్పు వేడి నీటిలో బేకింగ్ సోడా వేసి బాగా కలిపి త్రాగితే గ్యాస్ తగ్గుతుంది.
6.అల్లం
అల్లంలో నయం చేసే లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి.దీనిని వివిధ రూపాలలో
తీసుకోవచ్చు.అల్లం ముక్కలు,అల్లం టీ, అల్లం టాబ్లెట్స్ రూపంలో
తీసుకోవచ్చు.