ఇటీవలే కాలంలో సైబర్ నేరాలు చేయడం కోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకొని అమాయక ప్రజల నుండి లక్షల్లో డబ్బు కాజేస్తున్నారు.టెక్నాలజీని ఉపయోగించి బ్యాంక్ వివరాలు, KYC వివరాలు దొంగలించి మోసాలకు పాల్పడుతున్నారు.
మరొకపక్క ఆఫర్లు, ఫ్రీ అంటూ నోటిఫికేషన్స్ తయారు చేసి లింక్స్ పంపించి, జస్ట్ లింక్ పై ఒక క్లిక్ తో ఖాతాలో ఉండే డబ్బులను క్షణాల్లో మాయం చేస్తున్నారు.దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లపై ఫిర్యాదులు పెరుగుతూనే ఉన్నాయి.
ఒక సైబర్ నేరగాడు కొత్త తరహా మోసం చేసి బాధితురాలు నుండి ఏడు లక్షల వరకు డబ్బులు కాజేశాడు.పన్వేల్ లోని ఓ నలభై ఏళ్ల మహిళకు, సౌరబ్ శర్మ(Saurabh Sharma) అనే వ్యక్తి తాను బ్యాంకు ఉద్యోగి అంటూ, క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేశాడు.
ఈ క్రెడిట్ కార్డుతో నగరంలోని స్పోర్ట్స్ క్లబ్ లలో మెంబర్షిప్ కూడా లభిస్తుందని మాయమాటలు చెబితే ఆమె నిజమే అని నమ్మింది.

ఆ మహిళ దగ్గర ఐఫోన్ ఉంది.కానీ ఆండ్రాయిడ్ డివైస్ ఉంటేనే క్రెడిట్ కార్డ్(Credit card) యాక్టివేట్ అవుతుందని నమ్మించి ఆమెకు ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు.క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ అయిన తర్వాత ఫోన్ ఉపయోగించాలని చెప్పి ఆమె ఇంటి వివరాలు తెలుసుకున్నాడు.అతనికి కావలసిన వివరాలు అన్నీ సేకరించిన తర్వాత ఆమెకు ఒక స్మార్ట్ ఫోన్ లో DOT సెక్యూర్,(DOT Secure) సెక్యూర్ ఎన్వాయ్ అథెంటికేటర్ అనే రెండు ఆప్స్ ఇన్స్టాల్ చేసి ఇచ్చాడు.
స్మార్ట్ ఫోన్ లో సిమ్ వేసి ఆ మోసగాడు చెప్పిన సూచనలు ఫాలో కావడంతో కాసేపటి తర్వాత, మొబైల్ కు రెండు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మెసేజెస్ వచ్చాయి.బ్యాంకులకు సెలవు కావడంతో మెసేజెస్ వచ్చిన వెంటనే ట్రాన్సాక్షన్ వివరాలు వెరిఫై కాలేదు.
ఆ మరుసటి రోజు బ్యాంకును సంప్రదించి ట్రాన్సాక్షన్ వివరాలు సేకరించగా బెంగళూరులోని ఒక జ్యూవెలరీ షాప్ లో క్రెడిట్ కార్డు ద్వారా 7 లక్షల షాపింగ్ చేసినట్టుగా బయటపడడంతో ఖండేశ్వర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.







