జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగాలా.. అయితే ఈ సీరంను ట్రై చేయండి!

సాధారణంగా కొందరికి జుట్టు రాలడమే( Hairfall ) తప్ప కొత్త జుట్టు ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు.దీని కారణంగా రోజురోజుకు జుట్టు పల్చగా మారిపోతుంటుంది.

 This Serum Helps To Stop Hair Fall And Improve Hair Growth Details, Hair Serum,-TeluguStop.com

అయితే ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ సీరంను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టు రాలడం తగ్గడమే కాదు ఒత్తుగా పెరగడం( Thick Hair ) కూడా ప్రారంభమవుతుంది.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి వాటర్ తో ఒకసారి కడగాలి.ఆపై అందులో అర కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Telugu Aloevera, Curry, Care, Care Tips, Fall, Serum, Healthy, Natural Serum, Th

మరుసటి ఒక కలబంద ఆకును( Aloevera ) తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న కలబంద, నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసుకోవాలి.అలాగే నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం అనేది రెడీ అవుతుంది.

Telugu Aloevera, Curry, Care, Care Tips, Fall, Serum, Healthy, Natural Serum, Th

ఈ న్యాచురల్ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ సీరం ను వాడడం అలవాటు చేసుకుంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

ఈ సీరం జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది.జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది.

అలాగే ఈ సీరం జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది.కురులు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

పైగా ఈ సీరంను వాడటం వల్ల చుండ్రు సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.స్కాల్ప్ హైడ్రేట్ గా, హెల్తీగా మారుతుంది.

మరియు ఈ సీరం జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తుంది.సన్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube