తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ సుహాసిని( Suhasini ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది సుహాసిని.
ఆ తర్వాత హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో అత్త పాత్రలలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు అరుదైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని బయట పెట్టగా మరి కొంతమంది మాత్రం వారి విషయాలను బయటకు చెప్పడానికి ఎంతగా ఇష్టపడలేదు.అయితే అలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో సుహాసిని కూడా ఒకరు.

ఏంటి నిజమా అని ఆశ్చర్యపోతున్నారా.మీరు విన్నది నిజమే.తాజాగా హీరోయిన్ సుహాసిని తనకున్న అనారోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చింది.కాగా తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన సుహాసిని ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగా కూడా పలు సినిమాలు తీస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈమె తనకు టీబీ( TB ) ఉందనే విషయాన్ని బయట పెట్టారు.
పరువు పోతుందనే భయంతో దీని గురించి దాచిపెట్టానని సుహాసిని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ.

నాకు ఉన్న జబ్బుని నేను సీక్రెట్ గా ఉంచాను.పరువు పోతుందని భయపడ్డాను.కానీ ఎవ్వరికీ తెలియకుండానే ఆరు నెలలు చికిత్స తీసుకున్నాను.కొన్నాళ్ల తర్వాత దీని గురించి బయటపెట్టి, అందరికీ టీబీ గురించి అవగాహన కల్పించాలని అనుకున్నాను అని సుహాసిని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.