టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ అలరిస్తూ దూసుకుపోతున్నారు మెగాస్టార్.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే చాలా వరకు దర్శకులు అవకాశాన్ని వదులుకోరు.
ఆయనతో సినిమాలు చేయడం కోసం దర్శకులు( Directors ) కూడా లైన్ లో వేచి ఉంటారని చెప్పాలి.అలా ఈ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని వచ్చి మిస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

వారిలో నేను కూడా ఒకరు అంటున్నారు ఒక డైరెక్టర్.ఆ డైరెక్టర్ మరెవరో కాదు వెంకీ కుడుముల( Venky Kudumula ).తాజాగా ఈ విషయం గురించి వెంకి కుడుముల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.భీష్మ హిట్ తర్వాత వెంకీ కుడుములు చిరు కి కథ చెప్పించి ఒప్పించగా, చిరంజీవితో వెంకీ సినిమా ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అనుకున్న సమయంలో ఆ సినిమా ఆగిపోయిందట.
తాజాగా వెంకీ కుడుములు రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో తనకు మెగాస్టార్ తో అవకాశం చేజారిన విషయాన్ని రివీల్ చేసారు.ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ.
భీష్మ సినిమా( Bheeshma movie ) తర్వాత చిరంజీవి గారి కోసం ఒక కథ అనుకున్నాను.

సినిమా కి సంబంధించి ఫస్ట్ ఐడియా చెప్తే మెగాస్టార్ చాలా ఎక్సైట్ అయ్యారు.నేను చిరంజీవి గారికి ఫ్యాన్ బాయ్ ని.చిరంజీవి గారితో చేసే సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని స్టోరీ, స్క్రీన్ ప్లే డెవలప్మెంట్ కి చాలా సమయం తీసుకుని దానిపై వర్క్ చేశాను.కానీ ఎక్కడో ఒక చోట నేను ఆయన్ని మెప్పించలేపోయాను.దానితో మరో కథతో వస్తానని చెప్పి ఆయన దగ్గర నుంచి వచ్చేశాను అంటూ వెంకీ కుడుముల చెప్పుకొచ్చారు.
చిరంజీవితో సినిమా మిస్ అయినందుకు చాలా ఫీల్ అయినట్టు కూడా చెప్పుకొచ్చారు వెంకీ కుడుముల.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.