ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.46
సూర్యాస్తమయం: సాయంత్రం 05.43
రాహుకాలం: మ 2.30 సా4.30వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల5.40 వరకు
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభం:
ఈరోజుమీ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీరు అంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని లాభాలను పొందుతారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో లాభాలను పొందుతారు.
బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
సింహం:
ఈరోజు మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
కన్య:
ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వలన నష్టాలు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
తులా:
ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనిలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.
వృశ్చికం:
ఈరోజు మీరు మనశ్శాంతి కోసం స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.
ధనస్సు:
ఈరోజు మీరు ఆరోగ్య సమస్య నుండి కుదుట పడతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోవడమే మంచిది.
మకరం:
ఈరోజు మీరు మీ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.కొన్నిదూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మీనం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.
అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
LATEST NEWS - TELUGU