వివాహమైన స్త్రీలు మంగళ సూత్రం విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు..

హిందూ సాంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగిన మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది.సమాజంలో గౌరవానికి కూడా కారణమవుతుంది.

 Married Women Should Not Make These Mistakes In The Case Of Mangalsutra, Mangals-TeluguStop.com

పెళ్లి అయిన తర్వాత మహిళలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలి మెట్టలను, మంగళసూత్రం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.సమాజంలో గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించిన వ్యక్తిగా ఆమెకు సమూచితమైన స్థానాన్ని ఇస్తుంది.

అందుకే పెళ్లి జరిగినా మహిళ కచ్చితంగా వీటిని ధరించాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మంగళ సూత్రం అంటే మంగళకరమైన బంధం అని అర్థం.

పెళ్లి రోజున వరుడు వధువు మెడలో కట్టే ఒక ప్రత్యేకమైన ఎప్పటికీ విడదీయలేని పవిత్రమైన అనుబంధమే మంగళసూత్రం.నిబద్ధతకు, ప్రేమకు, నమ్మకానికి చిహ్నంగా భర్త బ్రతికున్నంత కాలం భార్య మంగళ సూత్రాన్ని ధరించాలని పెద్దవారు చెబుతూ ఉంటారు.

వేద మంత్రోచ్ఛారణలతో బంధుమిత్రుల, కుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళ సూత్రం విషయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి.మంగళసూత్రాన్ని ఎప్పుడూ పడితే అప్పుడు మెడలో నుంచి అస్సలు తీయకూడదు.

మంగళ సూత్రంలో వచ్చే నల్లపూసలలో దైవభక్తి ఉంటుంది.అది ఆ జంటను నర దృష్టి నుంచి కాపాడుతుంది.

భర్తకు పరిపూర్ణమైన ఆయుష్షును ఇస్తుంది.

Telugu Bakti, Devotional, Mangalsutra, Married-Telugu Raasi Phalalu Astrology Ho

కాబట్టి భర్త ఆయుష్షు కోసం మంగళ సూత్రాన్ని ఎప్పటికీ మెడలోనే ఉంచాలి.మంగళ సూత్రం పోయిన, విరిగిపోయిన అరిష్టంగా పెద్ద వారు చెబుతారు.ముఖ్యంగా చెప్పాలంటే మంగళ సూత్రం విషయంలో కొంత మంది మహిళలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.

కొంత మంది మహిళలు మంగళ సూత్రానికి హెయిర్ పిన్నులు, పిన్నిసులు పెడుతూ ఉంటారు.అయితే వేద మంత్రాలతో పవిత్రంగా మెడలో కట్టిన మంగళ సూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని, అలా పడితే భర్త ఆయుష్షు మీద ప్రభావం పడుతుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube