కొందరికి శరీరం మొత్తం తెల్లగా, మృదువుగా ఉంటుంది.అలాగే ముఖం కూడా అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంది.
కానీ చేతులు మాత్రం నల్లగా నిర్జీవంగా ఉంటాయి.ఎండల ప్రభావం ఇందుకు ప్రధాన కారణం.
అలాగే డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, హైపర్ పిగ్మెంటేషన్, పలురకాల మందుల వాడకం వంటి అంశాల కారణంగా కూడా చేతులు నల్లగా మారుతుంటాయి.దీంతో చేతుల నలుపు ని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.
కొందరు బ్యూటీ పార్లర్ కి వెళ్లి బ్లీచింగ్ పద్ధతిని ఎంచుకుంటారు.
కానీ బ్లీచింగ్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.
మరిన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే సహజంగానే నల్లగా ఉన్న చేతులు తెల్లగా మారతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా పది నుంచి ఇరవై పుదీనా ఆకులను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్, హాఫ్ టేబుల్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు పుదీనా పేస్ట్, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత నిమ్మ చక్కతో చేతులను స్మూత్ గా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.

కనీసం పది నిమిషాల పాటు బాగా స్క్రబ్బింగ్ చేసుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా చేతులను క్లీన్ చేసుకోవాలి.ఆపై ఏదైన మాయిశ్చరైసర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ఎంత నల్లగా ఉన్న చేతులు అయినా సరే కొద్ది రోజుల్లోనే తెల్లగా మారతాయి.తమ చేతులు నల్లగా మారాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.అలాగే అండర్ ఆర్మ్స్ లో ఏర్పడిన నలుపును వదిలించడానికి సైతం ఈ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.