ఈ సంవత్సరం దీపావళి పండుగ( Diwali festival ) నవంబర్ 12వ తేదీన ఆదివారం వస్తూ ఉంది.ఈ రోజున భక్తులు లక్ష్మీదేవిని ( Goddess Lakshmi )ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు.
ఈ సమయంలో లక్ష్మీ అమ్మవారు తన భక్తులకు విశేషమైన ఆశీర్వాదాలు, అనుగ్రహాలను అందిస్తుంది.దీపావళి పండుగ ప్రతి సారి అమావాస్య రోజు జరుపుకుంటారు.
రాత్రి పూర్తిగా చీకటిగా ఉంటుంది.దీపాలను వెలిగించడం వల్ల చీకటి పై కాంతి విజయాన్ని సూచిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఇది భక్తులలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది.అలాగే వారిలో జ్ఞానకాంతి ప్రజ్వరిల్లుతుంది.
వాస్తు ప్రకారం దీపావళి రోజున కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.దీంతో లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.అందుకే కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను( Vastu rules ) పాటిస్తే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందవచ్చు.
వాస్తు ప్రకారం దీపావళికి ముందు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులను తీసివేయాలి.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు( Broken glasses ) ఉంటే దీపావళికి ముందు తొలగించడం మంచిది.అలాగే ఇంట్లో ఇది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచే అవకాశం ఎక్కువగా ఉంది.
దీని వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి.అందుకే పగిలిన అద్దాలను ఇంట్లో నుంచి తీసేయడం మంచిది.

అలాగే ఇంట్లో ఆగిపోయిన గడియారం( stopped clock ) ఉంటే వెంటనే తీసేయండి లేదా మరమ్మత్తు చేయండి.లేదంటే కుటుంబ సభ్యుల పై అనవసర ఒత్తిడి పెరుగుతుంది.ఇంకా చెప్పాలంటే దీపావళి రాకముందు ఇంట్లో ఉండే విరిగిన వస్తువులను తొలగించాలి.ఎందుకంటే ఇవి ఇంట్లో వాస్తు దోషాలను సృష్టిస్తాయి.ఇంటి పురోగతిని అడ్డుకుంటాయి.అదే సమయంలో ఇంట్లో విరిగిపోయిన మంచం ఉంటే వెంటనే తొలగించాలి.
లేదంటే ఇంట్లో కలహాలు మొదలవుతాయి.అలాగే దీపావళి రోజు పాత దీపాలను ఉపయోగించకూడదు.
కొత్త దీపాలు కొనుగోలు చేయడం మంచిది.