మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాసి ఫలాలను చాలామంది ప్రజలు నమ్ముతారు.కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ప్రజల రాశులలో చిన్నచిన్న దోషాలు ఉంటాయని చెబుతూ ఉంటారు.
అయితే కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.కొన్ని రాశుల వారికి కాస్త ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత పరిస్థితులు అవే చక్కదిద్దుకుంటాయి.
ధంతేరాస్ రోజు ఏ రాశివారు ఏం కొనుగోలు చేయడం వల్ల వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.మేష రాశివారు ధంతేరాస్ రోజు పసుపు వస్తువుల కొనుగోలు చేయడం మంచిది.
తాబేలు వంటి వస్తువులను ఇంటి అలంకరణ వస్తువులో పెట్టాలి.వృషభ రాశి వారు బంగారం, రాగి వస్తువులను కొనుగోలు చేయాలి.
మిథున రాశివారు బంగారం కొనుగోలు చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది.కర్కాటక రాశి వారు వజ్రాలు, విలువైన రాళ్లు, ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల వీరికి శుభం జరిగే అవకాశం ఉంది.
సింహ రాశి వారు వెండి లేదా బంగారు విగ్రహాలలో లక్ష్మీ దేవిని కొనుగోలు చేయడం వల్ల ఆ కుటుంబ సభ్యులకు మంచి జరిగే అవకాశం ఉంది.కన్య రాశివారు ఆకుపచ్చ రంగుతో ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
తుల రాశివారు వజ్రాలు, ప్లాటినం, బంగారం, వెండి వంటి ఖరీదైన ఏదైనా కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం.

వృశ్చిక రాశి వారికి నచ్చిన వస్తువును కొనుగోలు చేయాలి.బంగారం, వజ్రాలు, పుస్తకాలు, నీటికి సంబంధించిన ఏవైనా వస్తువుల కొనుగోలు చేయవచ్చు.ధనస్సు రాశి వారు ఇతరులకు బహుమతిగా ఇవ్వగల ఏదైనా కొనుగోలు చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది.
మకర రాశి వారు బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.కుంభ రాశివారు ముఖ్యంగా బంగారం, పసుపు నీలమణి రూబీ స్టోన్ వంటివి కొనుగోలు చేయడం ఉత్తమం.
మీన రాశివారు కొన్ని అలంకార వస్తువులు, వెండి నాణేలు, విగ్రహాలు ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం మంచిది.