బీట్ రూట్.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
దుంప జాతికి చెందిన బీట్ రూట్‌ను జ్యూస్ రూపంలో, సలాడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటుంటారు.ముఖ్యంగా రక్త హీనత సమస్యతో బాధ పడేవారు.
ఖచ్చితంగా బీట్ రూట్‌ను డేట్‌లో చేర్చుకుంటారు.ఎందుకంటే, బీట్ రూట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ఇది రక్త హీనత సమస్యను అరికడుతుంది.ఇక బీట్ రూట్‌తో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
అయితే ఆరోగ్యానికి బీట్ రూట్ మంచిదే అయినప్పటికీ.అతిగా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.
అవును, బీట్ రూట్ అతిగా తీసుకంటే చాలా డేంజర్.మరి ఓవర్‌గా బీట్ రూట్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.బీట్ రూట్ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల.అందులో ఉండే ఆక్సలేట్లు మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి.
దీంతో తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అలాగే జీర్ణాశయ సమస్యలు ఉన్న వారు బీట్ రూట్‌ను అతిగా తీసుకుంటే.
ఆ సమస్యలు మరింత రెట్టింపు అయిపోతాయి.
మధుమేహం వ్యాధి గ్రస్తులకు బీట్ రూట్ మంచిదే.అలా అని ఓవర్‌గా వాటిని తీసుకుంటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగిపోతాయి.బీట్ రూట్లో ఐరన్, కాపర్, ఫాస్ఫరస్ , మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి.కానీ, ఇవి శరీరానికి కావాల్సిన దాని ఎక్కువ తీసుకుంటే.
దాని ప్రభావం కాలేయం మరియు కిడ్నీపై పడతారు.ఫలితంగా అనేక సమస్యలు తలెత్తుతాయి.
బీట్ రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల రక్త పోటు స్థాయి పడిపోతుంది.అధిక రక్తపోటు ఎంత ప్రమాదమో.రక్త పోటు తగ్గిపోవడం కూడా అంతే ప్రమాదం.కాబట్టి, ఎప్పుడూ కూడా ఓవర్‌గా బీట్ రూట్‌ను తీసుకోకండి.
ఇక బీట్ రూట్‌ను అతిగా తీసుకోవడం వల్ల దద్దుర్లు, కిళ్ల నొప్పులు ఇలా అనేక సమస్యలు ఏర్పడతాయి.సో.బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిది కదా అని అధికంగా మాత్రం తీసుకోకండి.