లాక్ డౌన్ కారణంగా ఎన్నో సినిమాలు షూటింగ్ దశలోనే ఆగిపోయాయి.ప్రస్తుతం అన్ని సినిమాలు షూటింగ్ ని జరుపుకుంటూ నిర్మాణం జరుపుకుంటున్నాయి.
ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని రాజమౌళి ప్రకటించడంతో మిగిలిన సినిమాలైనా వకీల్ సాబ్, పుష్ప, కేజిఎఫ్, ఎఫ్ 3 వంటి చిత్రాల దర్శక నిర్మాతలు వారి సినిమాల విడుదల తేదీలను ముందుగానే ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానున్నాయో ప్రకటించాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్ ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతోందన్న విషయం మనకు తెలిసిందే.దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత తిరిగి తెలుగుసినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు హీరో సిద్ధార్థ.
ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్, శర్వానంద్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న “మహాసముద్రం” రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించారు.ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి ఆగస్టు 19న మీ ముందుకు వస్తున్నాం.
’అంటూ రిలీజ్ డేట్ ను విడుదల చేశారు.
![Telugu Maha Samudram, Sharwand, Siddharth-Movie Telugu Maha Samudram, Sharwand, Siddharth-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/01/maha-samudram-release-date.jpg )
ఈ మహా సముద్రం సినిమా టైటిల్ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంగీతం చైతన్ భరద్వాజ్ అందించనున్నారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేశారు.