వైరల్ వీడియో: స్టేజిపై డాన్స్ తో అదరగొట్టిన మోనాలిసా

కుంభమేళా( Kumbh Mela ) పుణ్యమా అని రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన మోనాలిసా భోంస్లే( Monalisa Bhosle ) ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.తాజాగా, ఆమె జ్యూవెలరీ షాప్ ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేస్తున్నారు.

 Mahakumbh Viral Girl Monalisa Dance Video Viral Details, Monalisa Dance, Monalis-TeluguStop.com

తాజాగా కేరళలోని ఓ జ్యూవెలరీ షాప్ ప్రారంభోత్సవానికి( Jewelry Launch ) హాజరైన మోనాలిసా, ఈ సందర్భంగా వేదికపై డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ప్రత్యేకంగా, ఆమె పూర్తిస్థాయి మేకోవర్‌లో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటి వరకు చాలా సింపుల్ లుక్‌ లోనే కనిపించిన ఆమె, కొత్త మేకప్ లుక్‌తో మోడ్రన్ అవతారం ఎత్తారు.

మోనాలిసా తాజాగా ఓ సినిమా ఆఫర్‌ను( Movie Offer ) కూడా అంగీకరించినట్లు చెప్పారు.‘‘ఇది సోషల్ మీడియా యుగం.ఎవరి లైఫ్ అయినా ఒక్కరోజులోనే మారిపోవచ్చు’’ అంటూ ఆమెపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఆమె కుటుంబ విషయానికి వస్తే.మధ్యప్రదేశ్‌కు చెందిన గిరిజన కుటుంబానికి చెందిన మోనాలిసా భోంస్లే, కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించారు.

ఓ వ్యక్తి ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయిపోయింది.ఒక్కసారిగా ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

ఈ క్రమంలోనే ఆమెకు వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

జ్యూవెలరీ షాప్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా ఆహ్వానం, పూసల బ్రాండ్ అంబాసిడర్‌గా( Brand Ambassador ) అవకాశం, అంతేకాదు సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా రావడం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.నిరుపేద కుటుంబంలో జన్మించిన మోనాలిసా, గతంలో రోజు గడవాలంటేనే కష్టమయ్యే పరిస్థితిలో ఉండేవారు.కానీ, ఇప్పుడు ఆమె తన సెలబ్రిటీ స్టేటస్‌ను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

డాన్స్ నేర్చుకుంటూ, మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ముందుకు వెళ్తున్నారు.దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తాయని నెటిజన్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

రాత్రికి రాత్రే మారిపోయిన ఈ జీవితాన్ని మోనాలిసా ఎంతవరకు నిలబెట్టుకుంటారో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube