తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మూల స్థంబాలు అనగానే మొదటి తరం హీరోలు అయితే సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని( Senior NTR, Akkineni ) వంటి వారి పేర్లు చెప్తారు.ఇక రెండవ తరం విషయానికి వస్తే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ( Chiranjeevi, Nagarjuna, Balakrishna ) మరియు వెంకటేష్( Venkatesh ) పేర్లు వినిపిస్తాయి.
ఈ నలుగురు హీరోలు దాదాపు సమఉజ్జిలుగా చెప్పుకుంటారు.అయితే ఈ నలుగురు హీరోలు కూడా యాభై ఏళ్లకు పైబడిన వారే.
పైగా వీరి సంతానం కూడా ఎవరికి నచ్చిన జాబ్ వాళ్ళు చేసుకుంటే కెరీర్ లో బాగానే సెటిల్ అయ్యారు.మరి ముఖ్యంగా సంతానం వల్ల ఒకింత తృప్తిగా ఉన్న హీరోల విషయానికి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ గురించి.

ఈయనకు కొడుకు ఇండస్ట్రీ కి వస్తాడు అనే ఆశ పూర్తిగా పోతున్నప్పటికీ కూతుళ్ళ విషయంలో మాత్రం చాలా హ్యాపీ గా ఉన్నారు.బాలకృష్ణ ఇద్దరు కుమార్తెలు కూడా వ్యాపారం లో బిజీ గా ఉంటూ బాలయ్య చేతికి మనవళ్లను కూడా పెట్టారు.బాలకృష్ణ పెద్ద కుమార్తె కు ఒక కుమారుడు ఉండగా, హెరిటేజ్ వ్యాపార సంస్థను( heritage ) ఆమె దగ్గర ఉండి చూసుకుంటే బాగా అభివృద్ధిలోకి తీసుకోస్తుంది.ఇక చిన్న కూతురికి ఇద్దరు కుమారులు కాగా, ఆమె తన అత్తింటి వ్యాపారం అయినా వ్యాపార రంగంలో ఉన్నారు.

ఇక వెంకటేష్ కి ముగ్గురు కుమార్తెల తో పాటు ఒక కుమారుడు ఉండగా, ఒక్కో కూతురు తండ్రి అండదండలతో పని లేకుండా సొంతంగా ఎదుగుతూ అందరికి ఆదర్శం గా నిలుస్తున్నారు.ఇక కుమారుడు ఇంకా చదువులు పూర్తి చేయాల్సి వుంది.

చిరంజీవి విషయానికి వస్తే ఇద్దరు కుమార్తెలు మరియు కుమారుడు రామ్ చరణ్( Ram Charan ) గురించి అందరికి తెలిసిందే.కుమారుడి సక్సెస్ అయన బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే కూతుళ్లు కూడా ఎదో ఒకటి కాకుండా పెద్ద అమ్మాయి సుష్మిత తండ్రికి వ్యక్తి గత కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు.అలాగే ఆమె మంచి అభిరుచి ఉన్న వ్యక్తి అని ఇండస్ట్రీ లో టాక్ వుంది.అలాగే చిన్న కూతురు శ్రీజ సైతం వ్యక్తి గత జీవితంలో విఫలం అయినా ఎదో ఒకటి సాధించాలనే తపనతో ఉన్నారు.
ఈ ముగ్గురు హీరోల తర్వాత నాగార్జున విషయానికి వస్తే ఇద్దరు కుమారులు మాత్రమే ఉన్నారు.వారు కూడా ఇంకా సెట్ కాలేదు.అందుకే ఆయనకు పుత్రికోత్సాహం కూడా లేదు అనే చెప్పాలి.