చుండ్రు, తలలో దురదకు చెక్ పెట్టే బెస్ట్ హోమ్ మేడ్ టోనర్ మీకోసం!!

చుండ్రు ( dandruff )విపరీతంగా వేధిస్తుందా.? ఎన్ని రకాల షాంపూలు మార్చిన చుండ్రు పోవడం లేదా.? చుండ్రు వల్ల తలలో దురద కూడా వస్తుందా.? అయితే అస్సలు వర్రీ అవ్వండి.చుండ్రు మరియు తలలో దురద‌ను పోగొట్టే బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ టోనర్ ఒకటి ఉంది.ఈ టోనర్ ను కనుక వాడితే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్న దూరం అవుతుంది.

 This Homemade Toner Helps To Get Rid Of Dandruff And Itchy Scalp! Itchy Scalp, D-TeluguStop.com

అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలు కూడా పొందుతారు.మరి ఇంతకీ ఆ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కలబంద( Aloe vera ) ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు( Five cloves of garlic ) తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు మరియు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.

వీటితో పాటు నాలుగు రెబ్బలు కరివేపాకు( curry leaves ) వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Dandruff, Care, Care Tips, Healthy Scalp, Homemade, Homemadehelps-Telugu

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన టోనర్ అనేది సిద్ధం అవుతుంది.గోరువెచ్చగా అయిన తర్వాత ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

Telugu Dandruff, Care, Care Tips, Healthy Scalp, Homemade, Homemadehelps-Telugu

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే చుండ్రు సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.అలాగే తలలో దురద, చిరాకు, చెడు వాసన వంటి సమస్యలు దూరం అవుతాయి.అంతే కాకుండా ఈ టోనర్ హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటుంది.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.హెయిర్ బ్రేకేజ్ సమస్యను సైతం అరికడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube