చుండ్రు, తలలో దురదకు చెక్ పెట్టే బెస్ట్ హోమ్ మేడ్ టోనర్ మీకోసం!!
TeluguStop.com
చుండ్రు ( Dandruff )విపరీతంగా వేధిస్తుందా.? ఎన్ని రకాల షాంపూలు మార్చిన చుండ్రు పోవడం లేదా.
? చుండ్రు వల్ల తలలో దురద కూడా వస్తుందా.? అయితే అస్సలు వర్రీ అవ్వండి.
చుండ్రు మరియు తలలో దురదను పోగొట్టే బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ టోనర్ ఒకటి ఉంది.
ఈ టోనర్ ను కనుక వాడితే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్న దూరం అవుతుంది.
అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలు కూడా పొందుతారు.మరి ఇంతకీ ఆ టోనర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కలబంద( Aloe Vera ) ఆకు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు( Five Cloves Of Garlic ) తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు మరియు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.
వీటితో పాటు నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry Leaves ) వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
"""/" /
అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె( Mustard Oil ) వేసి బాగా మిక్స్ చేస్తే మన టోనర్ అనేది సిద్ధం అవుతుంది.
గోరువెచ్చగా అయిన తర్వాత ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.
"""/" /
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే చుండ్రు సమస్యకు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.
అలాగే తలలో దురద, చిరాకు, చెడు వాసన వంటి సమస్యలు దూరం అవుతాయి.
అంతే కాకుండా ఈ టోనర్ హెయిర్ ఫాల్ ను అడ్డుకుంటుంది.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
హెయిర్ బ్రేకేజ్ సమస్యను సైతం అరికడుతుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘కిష్కింధపురి ‘ టీజర్ ఎలా ఉందంటే..?