హిందూ సంప్రదాయంలో తులసికి ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇందులో రెండు జాతులున్నాయి.
ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అని అంటారు.వీటిలో సాధారణంగా కృష్ణతులసిని పూజకు వాడుతారు.
ఆయుర్వేద ఔషధాలలో కూడా కృష్ణతులసిని ఎక్కువగా వాడతారు.తులసిని పూజలలో ఉపయోగిస్తారు.
అలాగే తులసిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.తులసిలో యాంటి ట్యూబర్క్యులర్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్, యాంటి వైరల్ గుణాలున్నాయి.1.తులసి రసం,అల్లం రసం,తేనే కలిపి తీసుకుంటే మలబద్దక సమస్య నుండి బయట పడవచ్చు.2.తులసి ఆకుల కషాయాన్ని ప్రతి రోజు త్రాగితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.3.తులసి రసంలో నిమ్మరసం కలిపి చర్మంపై రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి.4.తులసి రసంలో శొంఠి కలిపి తీసుకుంటే కడుపునొప్పి సమస్య తగ్గుతుంది.5.తులసిలో జ్ఞాపకశక్తి, చురుకుదనంను పెంచే లక్షణాలు ఉన్నాయి.అందువల్ల చదువుకొనే పిల్లలకు రోజు రెండు తులసి ఆకులు తినిపిస్తే మంచిది.6.మెటబాలిక్ వ్యవస్థను పటిష్ట పరచి, రక్తంలో చెడు రసాయనాలను బయటకు పంపటం ద్వారా కాలేయ సంబంధిత వ్యాధులకు చికిత్సగా తులసి పనిచేస్తుంది.7.తులసి ఆకులు, మిరియాలు దంచి బాగా మరిగించి కషాయం తయారు చేసి రెండు చెంచాలు చొప్పున త్రాగితే జలుబు నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.ఇన్ని ఉపయోగాలు ఉన్న తులసి వాడి ఆరోగ్య సమస్యల నుండి బయట పడండి.