యాక్టింగ్, రైటింగ్ అనేవి రెండు డిఫరెంట్ స్కిల్స్.ఈ రెండు ఓకే సమయంలో చేయడం అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణించడమే అవుతుంది.
మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటు యాక్టింగ్ తో పాటు ఇటు రైటింగ్ లో రాణిస్తున్న మల్టీ టాలెంట్ హీరోలు చాలా మంది ఉన్నారు.ఇంతకీ వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అడవి శేషు

ఈ హీరోకు చాలా కళలు తెలుసు.ఓ వైపు నటుడిగా తన సత్తా చాటుతూనే కృష్ణం, గూడచారి, ఎవరు సినిమాలకు కథతో పాటు, స్క్రీన్ ప్లే అందించాడు.
నవీన్ పొలిశెట్టి
తన చక్కటి నటనతో పాటు అద్భుత టైమింగ్ తో కామెడీ పేల్చే ఈ యంగ్ హీరో సైతం రచయితగా ముందుకు సాగుతున్నాడు.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు స్క్రీన్ ప్లే రాశాడు.
సిద్దు జొన్నల గడ్డ

తాజాగా ఈ నటుడు సైతం మా వింత గాధ వినుమా అనే సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించాడు.ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.కృష్ణ అండ్ హిస్ లీలా అనే సినిమాతో మంచి హిట్ కొట్టాడు సిద్దు.
నాగశౌర్య

పలు సినిమాల్లో హీరోగా నటించిన నాగశౌర్య కూడా మంచి రైటర్.తాజాగా అశ్వథామ అనే సినిమాకు స్టోరీ రాశాడు.ఈ మూవీకి తనే నిర్మాతగా వ్యవహరించాడు.
విశ్వక్షేన్

మళయాలం మూవీని తెలుగులో ఫలక్ నుమా దాస్ పేరుతో రీమేక్ చేశారు.ఈ సినిమాకు తనే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.
మంచు విష్ణు

కాజల్ ను తన సిస్టర్ క్యారెక్టర్ చేయించి మంచు మనోజ్ హీరగా మోసగాళ్లు సినిమా తీసుకున్నాడు విష్ణు.స్కామ్ నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సినిమాకు తనే స్టోరీ రాసి, తనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.<
.