సుందరం మాస్టారు భార్య ఉండగానే రహస్యంగా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ లాంటి వారు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ వాళ్లు చేసే సినిమాల్లో పెద్దగా డ్యాన్సులు ఉండేవికావు ఎందుకంటే ఆ తరం జనరేషన్ లో ఉన్న వాళ్లకి డాన్స్ లు పెద్దగా రావు కాబట్టి ఒకే నాలుగైదు స్టెప్పులని అన్ని సినిమాల్లో వాడుతూ ఉండేవారు ఆ స్టెప్పుల ని చాలామంది స్టేజ్ షో చేసే ఆర్టిస్టులు కామెడీ గా కూడా చేసేవారు.అయితే ఒకసారి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా డాన్స్ కి సంబంధించిన స్టెప్పులు మొత్తం మారిపోయాయి బ్రేక్ డాన్స్ చేయడం లో చిరంజీవి దిట్ట అని అనిపించుకున్నాడు కానీ బ్రేక్ డాన్స్ అతనితో చేపించిన డాన్స్ మాస్టర్ ఎవరు అంటే తడబడకుండా తార మాస్టర్ పేరే చెప్పాలి.

Telugu Prabhudeva, Prasad, Raju Sundaram, Sundaram Master, Sundarammaster, Tara

ఎందుకంటే అప్పట్లో చిరంజీవి చేసిన సినిమాలన్నింటికి తార మాస్టర్ కొరియోగ్రఫీ చేసేవారు.అయితే అందరి కంటే సీనియర్ మాస్టర్ అయిన సుందరం మాస్టర్ కూడా చిరంజీవి కి చాలా సినిమాలో స్టెప్పులు నేర్పాడు కానీ తారా మాస్టర్ వచ్చిన తర్వాత తన డాన్స్ కి ఒక స్టైల్ ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు.సుందర మాస్టారు చాలా మంది హీరోల సినిమాలకి కొరియోగ్రఫీ చేసినప్పటికీ ఆయన స్టైల్ వేరేలా ఉండేవి తార మాస్టర్ స్టైల్ ఇంకోలా ఉండేది.తార మాస్టర్ మొదట సుందరం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ డాన్సర్ గా పనిచేసేవారు అదే టైం లో సుందరం మాస్టారు తనని రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వీరిద్దరికీ సంబంధించిన విషయాలు ఎవరితో చెప్పొద్దు అని కూడా అప్పట్లో అనేవారట వీళ్ళిద్దరికీ ఒక బాబు కూడా పుట్టాడు అని తార మాస్టర్ చెప్తున్నారు.

అయితే ప్రస్తుతం తార మాస్టర్ కి సంబంధించిన బాగోగులు ఎవరు పట్టించుకోవడం లేదని సుందరం మాస్టర్ తనని పెళ్లి చేసుకున్నారని వాళ్లకు బాబు కూడా ఉన్నాడని ఇప్పుడు వాళ్ళకి భరణం చెల్లించాలని ఆమె కోర్టులో సుందరం మాస్టార్ పైన కేసు ఫైల్ చేశారు.

Telugu Prabhudeva, Prasad, Raju Sundaram, Sundaram Master, Sundarammaster, Tara

ఇన్నిరోజులు ఆమెనీ ఒంటరిగా వదిలేసినందుకు 5 కోట్లు నష్టపరిహారాన్ని ఇస్తూ నెలకి 75 వేల రూపాయలు ఆమెకు చెల్లించాలని ఆమె కేసులో మెన్షన్ చేశారు.అయితే సుందర మాస్టారు తారా మాస్టర్ ని రహస్యంగా పెళ్లి చేసుకొని వదిలేసిన తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు.వాళ్లకి రాజు సుందరం, ప్రభుదేవా, ప్రసాద్ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే వీరు ముగ్గురు కూడా ప్రస్తుతం సినిమా లోనే ఉన్నారు.

రాజు సుందరం మాస్టర్ చాలా సినిమాలోకి కొరియోగ్రఫీ చేశారు ప్రస్తుతం చేస్తున్నారు.అప్పుడప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటారు అదే విధంగా ప్రభుదేవా కూడా ఇండియాలో నెంబర్ వన్ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ప్రభుదేవా కొరియోగ్రఫీ తో పాటు సినిమా డైరెక్షన్ కూడా చేస్తున్నారు తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ప్రభుదేవా ఆ తర్వాత ప్రభాస్ హీరోగా పౌర్ణమి సినిమానీ తెరకెక్కించాడు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమాని తీశాడు.ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు.

Telugu Prabhudeva, Prasad, Raju Sundaram, Sundaram Master, Sundarammaster, Tara

సినిమాల్లో నటిస్తూ కొరియోగ్రఫీ కూడా చేస్తూ డైరెక్షన్ కూడా చేస్తున్నాడు.సుందర మాస్టారు చిన్న కొడుకు అయిన ప్రసాద్ కూడా తమిళ్ సినిమాలో నటిస్తున్నాడు.అయితే ప్రభుదేవా కూడా నయనతారని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తన భార్య కి విడాకులు ఇచ్చారు తర్వాత నయనతార ప్రభుదేవా పెళ్లి చేసుకోకుండా విడిపోయారు దీన్నిబట్టి చూసిన జనాలు ఏమంటున్నారంటే ప్రభుదేవా నే రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు అని అనుకున్నాం కానీ వాళ్ళ నాన్న సుందరం మాస్టారు కూడా రెండో పెళ్లి చేసుకున్నారా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఉన్నట్టు ఉన్నారు కదా అని జనాలు అనుకుంటున్నారు.తారా మాస్టర్ ని సుందరం మాస్టర్ పెళ్లి చేసుకున్నాడా లేదా ఆమె ఊరికే చెప్తుందా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది కామన్ గా జరుగుతుంది చూద్దాం ఎవరు చెప్పేది నిజమో

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube