ప్రస్తుత రోజుల్లో వెన్ను నొప్పి అనేది చాలా కామన్‌గా మారిపోయింది.బిజీ లైఫ్ స్టైల్, శ్రమకు మించి కష్టపడటం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం, ఓవర్‌గా వర్కౌట్స్ చేయడం, ఏదైనా గాయం అవ్వడం, హై హీల్స్ వేసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల తరచూ వెన్ను నొప్పి వేధిస్తూ ఉంటుంది.
దాంతో ఈ సమస్య నుంచి బయట పడటం కోసం విపరీతంగా పెయిన్ కిల్లర్స్ ను వాడుతుంటారు.కానీ, ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలను తీసుకుంటే పెయిన్ కిల్లర్స్‌తో పని లేకుండానే వెన్ను నొప్పిని నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
మొదట ఒకే చోట గంటలు తరబడి కుర్చునే అలవాటును మానుకోండి.
కంప్యూటర్ల ముందు వర్క్ చేసే వారైనా.కనీసం రెండు గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకుని ఓ ఐదు నిమిషాల పాటు అటు, ఇటు నడవాలి.
ఇలా చేస్తే వెన్ను ముక్కపై ఒత్తిడి తగ్గి నొప్పి దూరం అవుతుంది.అలాగే అధిక బరువు కూడా వెన్ను నొప్పికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి, ఓవర్ వెయిట్‌ను ఖచ్చితంగా అదుపులోకి తెచ్చుకోవాలి.అప్పుడే వెన్ను నొప్పి నుంచి సంపూర్ణగా బయటపడగలుగుతారు.

స్మోకింగ్ అలవాటు ఉంటే తప్పని సరిగా మానేయాలి.ఎందుకంటే, పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ వెన్ను నొప్పిని మరింత పెంచడంతో పాటు ఎముకలను బలహీన పరుస్తుంది.కాబట్టి, వీలైనంత త్వరగా స్మోకింగ్ అలవాటును వదిలించుకోవాలి.వెన్ను నొప్పి బాగా వస్తుంటే.ఐస్ కంప్రెసెస్‌ను ఎంచుకోవాలి.ఇది క్షణాల్లో నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
అల్లం టీ, మిరియాల టీ, గ్రీన్ టీ, మింట్ టీ వంటి హెర్బల్ టీలను తీసుకోవడం ద్వారా కూడా వెన్ను నొప్పి నుంచి బయట పడొచ్చు.ఇక వెన్ను నొప్పి పరార్ అవ్వాలంటే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాల్సిందే.
రోజుకు కనీసం అర గంట పాటు వ్యాయామాలు చేస్తే వెన్ను నొప్పి తగ్గడమే కాదు.మళ్లీ మళ్లీ రాకుండా కూడా ఉంటుంది.