ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలని ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు.ఈ పోరులో ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన వారెందరో.
వారందరి త్యాగ ఫలితంగా భారతావని 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం సాధించింది.స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నో కీలక ఘటనలు దేశాన్ని కుదిపేశాయి.ఇలాంటి వాటిలో ఒకటి జలియన్ వాలాబాగ్( Jallianwala Bagh ) మారణకాండ.100 ఏళ్లు దాటినా నేటికీ ఈ దురాగతం బ్రిటీష్ ప్రభుత్వంపై( British Government ) ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది.
రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా నాడు దేశవ్యాప్తంగా భారీగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.పంజాబ్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు డాక్టర్ సత్యపాల్, సైపుద్దీన్ కిచ్లూలను బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
దీనికి నిరసనగా అమృత్‌సర్‌లో ఆందోళనలు జరిగాయి.వీటిని అదుపు చేసేందుకు ప్రభుత్వం నగరంలో మార్షల్ లా విధించడంతో పాటు జనరల్ డయ్యర్( General Dyer ) నేతృత్వంలో భారీగా బలగాలను మోహరించింది.

అయితే వైశాఖీ పర్వదినంద సందర్భంగా జలియన్ వాలాబాగ్ తోటలో వేలాది మంది 1919 ఏప్రిల్ 13న సమావేశమయ్యారు.ఈ విషయం తెలుసుకున్న జనరల్ డయ్యర్ సారథ్యంలోని బ్రిటిష్ సైన్యం జలియన్ వాలాబాగ్‌లోకి చొరబడి అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది.50 మంది సైనికులు పది నిమిషాలు పాటు దాదాపు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో 379 మంది మరణించారని బ్రిటీష్ ప్రభుత్వం చెప్పినప్పటికీ.1000కి పైగా మరణించగా, 2000 మందికి పైగా గాయపడ్డారని అనధికారిక అంచనా.చిన్నారులు, మహిళలు, వృద్ధులను కూడా డయ్యర్ సేన వదిలిపెట్టలేదు.
ఇంతటి మారణహోమానికి కారణమైన జనరల్ డయ్యర్‌పై పగబట్టిన సర్దార్ ఉదమ్ సింగ్.కొన్నేళ్లపాటు వెంటాడి లండన్‌లో కాల్చిచంపారు.
ఈ నేరానికి గాను ఉదమ్ సింగ్‌ను బ్రిటీష్ ప్రభుత్వం ఉరి తీసింది.
ఈ దారుణ ఘటనకు గాను భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని విపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్( MP Bob Blackman ) యూకే పార్లమెంట్‌లో( UK Parliament ) ప్రస్తావించారు.
ఇక మూడేళ్ల క్రితం కామన్‌వెల్త్ డే సందర్భంగా హౌస్ ఆఫ్ కామన్స్‌లో జరిగిన చర్చలో స్కాటిష్ నేషనల్ పార్టీకి (ఎస్ఎన్‌పీ) చెందిన ఎంపీ స్టీవెన్ బోనార్ కూడా ఇదే రకమైన డిమాండ్ చేశారు.జలియన్ వాలాబాగ్ మారణహోమం జరిగి వందేళ్లు గడిచిన సందర్భంగా హౌస్ ఆఫ్ కామన్స్‌లో అప్పటి యూకే ప్రధాని థెరిసా మే తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇది బ్రిటీష్ ఇండియన్ చరిత్రపై మాయని మచ్చగా ఆమె అభివర్ణించారు .కానీ గత ప్రధానుల మాదిరిగానే థెరిస్సా మే కూడా ఈ ఘటనకు క్షమాపణలు చెప్పలేదు.