ప్రస్తుత సమ్మర్ సీజన్ లో( Summer ) ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనువిందు చేస్తుంటాయి.మామిడి పండ్లు( Mangoes ) తినకుండా సమ్మర్ ను పూర్తి చేయడం అసాధ్యమే.
అయితే చాలా మంది మామిడి పండ్లను నేరుగానే కాకుండా లస్సీ రూపంలో కూడా తీసుకుంటారు.సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సీ( Mango Lassi ) తయారు చేసుకోవడం చాలా సులభం.
మ్యాంగో లస్సీ వేసవి తాపాన్ని తీర్చడానికే కాదు మరెన్నో ఆరోగ్య లాభాలను సైతం చేకూరుస్తుంది.సులభంగా మ్యాంగో లస్సీ ఎలా తయారు చేసుకోవాలో మొదట తెలుసుకుందాం.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బాగా పండిన తీయటి మామిడిపండు ముక్కలు వేసుకోవాలి.అలాగే ఒక చిన్న కప్పు చిల్డ్ మిల్క్,( Chilled Milk ) మూడు టేబుల్ స్పూన్లు షుగర్ పౌడర్, ఐదు చుక్కలు మ్యాంగో ఎసెన్స్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత అందులో ఒక కప్పు ఫ్రెష్ పెరుగు( Fresh Curd ) మరియు కొద్దిగా వాటర్ వేసుకుని మరోసారి గ్రైండ్ చేసుకుంటే మన మ్యాంగో లస్సీ అనేది సిద్ధం అవుతుంది.ఈ లస్సీ చాలా రుచికరంగా ఉంటుంది.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా వేసవి తాపాన్ని తీర్చడానికి ఈ మ్యాంగో లస్సీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గా ఎంపిక చేసుకోవచ్చు.అలాగే ఈ మ్యాంగో లస్సీ నీరసం, అలసటను క్షణాల్లో దూరం చేస్తుంది.బాడీకి తక్షణ శక్తిని అందిస్తుంది.
మ్యాంగో లస్సీ జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మీ గట్‌లో చెడు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
మరియు మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

మ్యాంగో లస్సీలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, మీ ఎముకలను దృఢంగా మార్చేందుకు ఇది ఒక అద్భుతమైన పానీయం.ఇది మీ మొత్తం ఎముక మరియు దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అంతేకాదకుండా మ్యాంగో లస్సీలో లాక్టిక్ యాసిడ్, విటమిన్ సి మరియు విటమిన్ డి ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి.వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి మీ శరీరాన్ని సిద్ధం చేస్తాయి.







