రుతుస్రావం అయ్యే వారం రోజుల ముందు కాకరకాయ తింటే ఏమవుతుందో తెలుసా..

కాకరకాయ ఆయుర్వేదంలో మధుమోహం, స్థూలకాయంతో బాధపడే వారికి మంచి ఔషధం అని చెప్పవచ్చు.శరీరంలో పిండి పదార్థాలను తగ్గించేందుకు ఎక్కువగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు.30 మిల్లీలీటర్ల కాకరకాయ రసాన్ని తాగినప్పుడు మన శరీరంలోనీ రక్తంలో 42 శాతం చక్కెర తగ్గినట్లు అధ్యయనాలలో తెలిసింది.మధుమొహం, స్థూలకాయం సమస్యతో బాధపడేవారు రోజు పరిగడుపున 30 మిల్లీ లీటర్ల చొప్పున కాకరకాయ రసం తాగుతూ ప్రతిరోజు ఆహార నియమాలను పాటించి, వ్యాయామం చేయడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.

 What Happens If You Eat Bitter Gourd Before Menstruation Details, , Bitter Gourd-TeluguStop.com

రసాన్ని తీసుకోలేని వారు కాకరకాయను నీడలో ఎండబెట్టి గింజలతో సహా పొడి చేసి ఒక స్పూన్ పొడి తో మరో స్పూన్ నేరడు గింజల పొడి, ఒక చెంచాడు ఉసిరికాయ పొడి నీటిలో కలిపి పరగడుపున ప్రతిరోజు త్రాగడం వల్ల చక్కెర వ్యాధి అదుపులోకి వస్తుంది.ఇంకా చెప్పాలంటే కాకరకాయ రసం ఒక చెంచా, నిమ్మ రసం ఒక చెంచా, నాలుగైదు మిరియాల పొడి తేనెలో కలుపుకో కలిపి పరిగడుపున మూడు నుంచి నాలుగు నెలల పాటు తీసుకుంటే చర్మం వ్యాధులు, దురద, గజ్జి వంటివన్నీ తగ్గిపోతాయి.

కాస్త రక్తస్రావం అయ్యే ఆడవారు కాకరకాయ రసం తేనెను ఒక్కో చెంచా చొప్పున రుతుస్రావానికి వారం రోజుల ముందు తాగితే రక్తస్రావం తగ్గే అవకాశం ఉంది.

అంతేకాకుండా కడుపులో నులిపురుగులతో బాధపడే పిల్లలకు అర చెంచా కాకరకాయ రసం, ఒక చెంచా తేనె కలిపి రాత్రి పూట పడుకునే ముందు మూడు నుంచి నాలుగు రోజుల పాటు తాగిస్తే కడుపులోని నూలు పురుగులు చనిపోతాయి.అంతేకాకుండా అధిక మధ్యపానం చేసే వారికి మత్తు దిగాలంటే రెండు చెంచాల కాకరకాయ కసాన్ని తాగిస్తే ఇది విరుగుడులా పనిచేస్తుంది.పాదాల మంటగా ఉన్నప్పుడు కాకరకాయ రసం పుస్తే వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంది.

చెక్కర వ్యాధి, కాలయ వ్యాధులతో బాధపడేవారు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకే కాకరకాయ రసాన్ని తీసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube