ఆరకాకరకాయ.చిన్న సైజు పరిమాణంలో ఉంటుంది.
ఇది కాకరకాయ జాతికి చెందినదే అయితే ఈ ఆరకాకరకాయ చేదు ఉండదు.ఈ కాకరకాయని ఆహారంలో తీసుకోవడం వలన మధుమేహం, గుండె జబ్బులు, అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.
ఆరకాకరకాయలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.ఇది శరీరంలో ఉండే వ్యర్ధాలని బయటకి పంపుతుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి.ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది అందుకే షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఆరకాకరకాయని తినడం చాలా మంచిది .దీనిలో ఉండే ఒక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే క్యాన్సర్ కణాలు వృద్ది కాకుండా వాటిని నివారిస్తాయి.శరీరంలో ఏర్పడే కణితులని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ “సి” శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ లతో పోరాడుతుంది.యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్న ఈ కాకర చర్మాన్ని కాపాడుతాయి ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
గర్భిణులు ఈ ఆరకాకరని తీసుకోవడం వలన లోపల ఉండే శిశువు ఎదుగుదలకి తోడ్పడుతుంది.ఇందులో ఉండే పోలేట్ శరీరంలో కొత్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది.
ఇందులో ఉండే ఫూటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.మూత్రపిండాల సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆరకాకర కాయలు వాడటం చాలా మంచిది అని వైద్యులు చెప్తున్నారు.