న్యూస్ రౌండప్ టాప్ 20

1.జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Lokesh, Mla Seethakka, Brahmani, Ramakrishn

నిరుపేదల కోసం నిలబడిన మన ప్రభుత్వం ఒకవైపు ఉంటే నిరుపేదలను వంచించినవారు మరోపక్క ఉన్నారు అని వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( YS Jagan Mohan Reddy ) ప్రజలను ఉద్దేశించి అన్నారు .

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, , Ysrcp, A-TeluguStop.com

2.పదవులపై ఆశ లేదు : కోమటిరెడ్డి

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Lokesh, Mla Seethakka, Brahmani, Ramakrishn

పదవులపై తనకు ఎటువంటి ఆశ లేదని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) అన్నారు.

3.జగన్ సిగ్గుపడాలి : అచ్చెన్న

ప్రజలను దగా చేస్తూ ఉద్ధరిస్తున్నానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం జగన్ సిగ్గుపడాలని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.

4.  బ్రాహ్మణి విమర్శలు

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Lokesh, Mla Seethakka, Brahmani, Ramakrishn

ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రశ్నించారు.

5.తెలంగాణ గిరిజన గురుకులంలో లెక్చరర్ ఉద్యోగాలు

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ తాత్కాలిక ప్రతిపాదించిన సిరిసిట్లలోని టిటిడబ్ల్యూఆర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

6

.నిధుల విడుదల కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిటిషన్

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Lokesh, Mla Seethakka, Brahmani, Ramakrishn

నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని , నియోజకవర్గానికి సిడిఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క( MLA Seethakka ) పిటిషన్ దాఖలు చేశారు.

7.జనాభా ఆధారంగా బీసీలకు టికెట్లు ఇవ్వాలి

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల్లో పార్టీ తరఫున బీసీ లకే టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి మాణిక్యరావ టాక్రేను బీసీ రాజ్యాధికార సమితి విజ్ఞప్తి చేసింది .

8.వచ్చే నెల నుంచి టైగర్ సఫారీ

అమ్రా బాద్,  కవ్వాల్ టైగర్ రిజర్ ప్రాంతాలను వీక్షించేందుకు అనుమతులను పునరుద్ధరించింది.ఈ మేరకు వచ్చే నెల నాలుగు నుంచి పర్యాటకులను అడవిలో టైగర్ సఫారీకి అనుమతిస్తున్నారు.

9.లోకేష్ కు ముందస్తు బెయిల్

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Lokesh, Mla Seethakka, Brahmani, Ramakrishn

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

10.విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి పై నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు.

11.కెసిఆర్ పై కేటిఆర్ కామెంట్స్

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Lokesh, Mla Seethakka, Brahmani, Ramakrishn

రైతు బంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

1

2.కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్

టిఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని కాంగ్రెస్ భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు.

13.చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ ప్రారంభం

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

14.సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు .స్పందించిన కేంద్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ముంబై కార్యాలయంలో అవినీతి పేరుకుపోయిందని నటుడు విశాల్ చేసిన ఆరోపణలపై కేంద్రం స్పందించింది.ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దీనిపై విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.

15.రైతులకు కేటీఆర్ సూచన

వ్యవసాయంలో తెలంగాణ దూసుకుపోతోంది అని మంత్రి కేటీఆర్ అన్నారు.రైతులు వరి పండిస్తే సరిపోదని ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున పండించాలని కేటీఆర్ సూచించారు.

16.జగన్ ఆధానీల భేటీ వెనుక మర్మమేమిటి

 ఏపీ సీఎం జగన్ తో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం ఆదానీ రహస్య భేటీ వెనుక ఉన్న మర్మం ఏమిటని సిపిఐ రామకృష్ణ ప్రశ్నించారు.

17.విస్తారంగా వర్షాలు

Telugu Ap, Chandrababu, Hareesh Rao, Lokesh, Mla Seethakka, Brahmani, Ramakrishn

తెలంగాణలో శుక్ర,  శనివారాల్లో ఉరుములు,  మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

1

8.మరో రెండు కేసుల్లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ లు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.ఫైబర్ గ్రిడ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో లోకేష్ ముందస్తు దాఖలు చేశారు.

19.వైఎస్సార్ వాహన మిత్ర నిధులు విడుదల

వైఎస్సార్ వాహన మిత్ర పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విజయవాడలోని విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేశారు.

20.పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి : నాగబాబు

పార్టీలోని ప్రతి ఒక్కరూ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube