గ్రేప్స్.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్ట పడి తినే పండ్లు ఇవి.గ్రేప్స్ మంచి రుచి కలిగి ఉండటమే కాదు.ఎన్నో పోషకాలు కూడా దాగి ఉంటాయి.
విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, కాపర్, మాంగనీస్, థయామిన్, రైబో ఫ్లావిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉండే గ్రేప్స్.కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు కేశ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా కేశాలు నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేయడంలో గ్రేప్స్ గ్రేట్‌గా సహాయపడతాయి.మరి వీటిని ఎలా యూజ్ చేయాలో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని గ్రేప్స్‌ను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో బాదం పౌడర్ మరియు కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు అప్లై చేసి.గంట పాటు వదిలేయాలి.
అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా నాలుగు రోజులకు ఒకసారి చేస్తే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.
అలాగే చాలా మంది చుండ్రు సమస్యతో బాధ పడుతుంటారు.అలాంటి వారు గ్రేప్స్‌ను మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మ రసం మరియు పెరుగు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.అర గంట లేదా గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు పరార్ అవుతుంది.

ఇక కేశాలు నిగనిగలాడుతూ కనిపించాలంటే.ఒక కప్పు గ్రేప్స్ పండ్లు తీసుకుని పేస్ట్ చేసి అందులో పావు టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలపాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు బాగా పూసి.
ఒక గంట తర్వాత హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.
జుట్టు ఎప్పుడూ నిగనిగలాడుతూ అందంగా కనిపిస్తుంది.