ఈ డ్రింక్ టేస్ట్‌గా ఉండ‌ట‌మే కాదు.. బ‌రువును కూడా వేగంగా త‌గ్గిస్తుంది!

ఇటీవ‌ల రోజుల్లో ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ప‌ని చేయ‌డం, థైరాయిడ్‌, హార్మోన్ ఛేంజస్ వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల కోట్లాది మంది అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారు.మీరు ఓవ‌ర్ వెయిట్‌తో స‌త‌మ‌తం అవుతున్న వారేనా.? బ‌రువు త‌గ్గ‌డం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్ మీకు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఆ డ్రింక్ టేస్ట్‌గా ఉండ‌ట‌మే కాదు.బ‌రువును కూడా వేగంగా త‌గ్గిస్తుంది.మ‌రి లేటెందుకు ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో.

 This Drink Is Not Only Tasty It Also Reduces Weight Fast! Weight Loss Drink, Wei-TeluguStop.com

తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక క్యారెట్‌ను తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇలా క‌డిగిన క్యారెట్‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, పొట్టు తొల‌గించిన చిన్న అల్లం ముక్క‌, పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ ప‌సుపు, గ్లాస్ వాట‌ర్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

గ్రైండ్ చేసుకున్న క్యారెట్ మిశ్ర‌మం నుండి స్ట్రైన‌ర్ సాయంతో జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, రుచికి స‌రిప‌డా తేనె వేసుకుని బాగా మిక్స్ చేస్తే.

వెయిట్ లాస్ డ్రింక్ సిద్ధ‌మైన‌ట్లే.అధిక బ‌రువు స‌మ‌స్య‌తో తీవ్రంగా మ‌ద‌న ప‌డేవారు ఈ డ్రింక్‌ను ప్ర‌తి రోజు బ్రేక్ ఫాస్ట్ కు అర‌గంట ముందు ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

Telugu Applecider, Carrot, Tips, Latest-Telugu Health Tips

అలా చేస్తే అతి ఆక‌లి దూరం అవుతుంది.మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.దాంతో సూప‌ర్ ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాదండోయ్‌.పైన చెప్పిన డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్య‌వంతంగా మారుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.

మ‌రియు వ్య‌ర్థాలు, విషాలు తొల‌గిపోయి బాడీ క్లీన్‌గా కూడా మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube