గులాబీ పువ్వులు.( Rose Petals ) చూసేందుకు ఎంత అందంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయితే అలకరణకి మాత్రమే కాదు గులాబీ పువ్వులు ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా గులాబీ పువ్వులతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ క్రీమ్( Face Cream ) ను తయారు చేసుకుని వాడితే మేకప్ కూడా అక్కర్లేదు.
సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరుస్తారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజ్ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక కప్పు రోజ్ పెటల్స్ ను వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో రోజ్ పెటల్స్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్, నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు( Coconut Milk 0, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో స్మూత్ పేస్ట్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ స్మూత్ పేస్ట్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ), వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన రోజ్ క్రీమ్ సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని పడుకోవాలి.

ప్రతిరోజు నైట్ ఈ రోజ్ క్రీమ్ ను రాసుకుంటే చర్మ ఛాయ మెరుగుపడుతుంది.చర్మం కాంతివంతంగా, ఆకర్షణీయంగా మెరుస్తుంది.ఉదయానికి ముఖంలో మంచి గ్లో వస్తుంది.అలాగే చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ టోన్ ఈవెన్ గా మారుతుంది.చర్మంపై ముడతలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.
చర్మం మృదువుగా కోమలంగా మారుతుంది.ఈ హోమ్ మేడ్ రోజ్ క్రీమ్ ను కనుక రెగ్యులర్ గా వాడితే ఎలాంటి మేకప్ అక్కర్లేదు.
సహజంగానే అందంగా కనిపిస్తారు.కాబట్టి తప్పకుండా ఈ రోజ్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.