గ్రీన్ వెజిటబుల్స్ ప్రకృతికి ముద్దు బిడ్డల లాంటివి అంటారు.ఎందుకంటే ఇవి అడవితల్లి రంగైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
అడవులు ఎలాగైతే ఈ భూమిని ఆరోగ్యంగా ఉంచుతాయో, గ్రీన్ వెజిటబుల్స్ అలాగే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.గ్రీన్ వెజిటబుల్స్ వలన కలిగే లాభాల్లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
* గ్రీన్ వెజిటబుల్స్ తింటే విటమిన్‌లు, మినరల్స్, కాల్షియం, ఐరన్, ఫైబర్ .ఇలా అన్నిరకాల అవసరాలు శరీరానికి అందుతాయి.
* గ్రీన్ వెజిటబుల్స్ కంటిచూపుని మెరుగుపరుస్తాయి.మరీ ముఖ్యంగా పాలకూరలో లభించే లూటిన్ సెల్స్ డ్యామేజ్ అవకుండా కాపాడి, కంటిని, కంటి చూపుని రక్షిస్తూ ఉంటుంది.
* కొలెస్టరాల్ లెవెల్స్ ని అదుపులో పెట్టే శక్తి క్యాబేజికి ఉంది.ఇందులో దొరికే బెటా-కరోటినే గుండె సంబంధిత సమస్యలతో పోరాడడానికి ఉపయోగపడుతుంది.
* గ్రీన్ టర్నిప్ ఆకులలో ఐరన్ దండిగా లభిస్తుంది.ఇది రెడ్ బ్లడ్ సెల్స్ కి ఎంతో అవసరం.
* బ్రోకలీలో కాల్షియం బాగా దొరుకుతుంది.ఇది ఎముకల బలానికి మంచిది.
ఓస్టియోపోరోసిస్ శరీరానికి తగలకుండా కాపాడుతుంది బ్రోకలీ.
* పాలకూరలో పాలిఫేనల్స్ తో యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
డయాబెటిస్ ని ఆపడానికి, వస్తే పోరాడడానికి పాలకూర చాలా అవసరం.
* టర్నిప్ ఆకులలో విటమిన్ ఏ, సి మరియు కె లభిస్తాయి.
కంటి సమస్యల నుంచి మనల్ని కాపడటం వీటి స్పేషాలిటి.
కాబట్టి, మన రోజూ తినే తిండిలో రకరకాల గ్రీన్ వెజిటబుల్స్, ముఖ్యంగా ఆకుకూరలు ఉండేలా చూసుకోవడం ఉత్తమం.
ఇదేమి ఖర్చుతో కూడకున్న వ్యవహారం కాదు కదా.