ఇప్పటికీ మనస్పూర్తిగా నవ్వని అల్లు అర్జున్.. ఆ ట్రోల్స్ వల్లే ఇలా చేస్తున్నాడా!

మామూలుగా సోషల్ మీడియాలో హీరో హీరోయిన్ల పై డైరెక్టర్ నిర్మాతలపై దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి.ఒక సందర్భంలో హీరోలు హీరోయిన్లు, డైరెక్టర్లు ట్రోలింగ్స్ ని ఎదురుకోవాల్సిందే.

 Allu Arjun Did Not Smile With Whole Heart At Pushpa 2 Event Details, Allu Arjun,-TeluguStop.com

అల్లు అర్జున్ పై( Allu Arjun ) కూడా గతంలో చాలాసార్లు ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.నా పేరు సూర్య ఈవెంట్‌ క్లిప్స్‌ ని ఎక్కువగా ట్రోలింగ్ చేస్తుంటారు.

బన్నీ ఆ టైంలో నవ్విన తీరు, ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చిన వాటిని ఇప్పటికీ మీమ్స్, ట్రోలింగ్‌లో ట్రెండ్ చేస్తుంటారు.బన్నీ నవ్వుని ఇలా ట్రోలింగ్( Trolling ) చేస్తున్నారని ఆయన టీం గమనించినట్టుంది.

లేదా బన్నీయే ఆ ట్రోలింగ్‌ను చూసి ఉంటాడు.అందుకే అప్పటి నుంచి బన్నీ పబ్లిక్‌ లోకి వచ్చినప్పుడు, ఈవెంట్లో ఉన్నప్పుడు ఒకప్పటిలా మనస్పూర్తిగా నవ్వుకోవడం లేదు.

చేతులు అడ్డు పెట్టుకుని, నెమ్మదిగా నవ్వేస్తున్నాడు.ఒకప్పుడు బన్నీ హాయిగా, స్వేచ్చగా, మనస్పూర్తిగా నవ్వుకునేవాడు.కానీ ఈ ట్రోలింగ్ ప్రభావంతో బన్నీ మునుపటిలా ఉండటం లేదు.మరి ట్రోలింగ్స్ విషయంలోనే పుష్ప రాజు అలా ఉన్నాడా లేదంటే ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్నది తెలియడం లేదు.

ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) ఈవెంట్‌ లో కూడా బన్నీ అలానే కాస్త హుందాగా కనిపించే ప్రయత్నం చేశాడు.ఒకప్పటిలా జాలీగా కనిపించలేదు.ఇక శ్రీలీలతో( Sreeleela ) ఏదో మాట్లాడుతూ ఉన్న సందర్భంలోనూ బన్నీ నవ్వు వచ్చినా ఆపేసుకునే ప్రయత్నం చేశాడు.

బన్నీ మనస్పూర్తిగా ఇంకా నవ్వుకోవడం లేదని, ట్రోలింగ్ వల్లే ఇలా నవ్వుని కూడా దాచుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసేందుకు సిద్దం అయ్యాడు.ప్రీ రిలీజ్‌ తోనే వెయ్యి కోట్ల మార్క్‌ ను బన్నీ టచ్ చేశాడు.

పుష్ప 2 చిత్రానికి ఏ మాత్రం కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డుల్ని గల్లంతు చేసేలా ఉన్నాడు.మరి బన్నీ వెయ్యి, రెండు వేల కోట్ల మార్కెట్‌ ను ఈ పుష్ప 2 తో ఏర్పర్చుకుంటాడో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube