టాలీవుడ్‌కు రాబోయే కాలమంతా కూడా పెద్ద సినిమాల పండుగే కనిపిస్తోంది.చిన్న చిన్న సినిమాలు ఇప్పటికే అలరించాయి.
ఇక వచ్చే డిసెంబర్ నుంచి ప్యాన్ ఇండియా సినిమాల హవా కొనసాగబోతోంది.కాగా పెద్ద మూవీలు, భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాలు అన్నీ కూడా వెంట వెంటనే రిలీజ్ కావడంతో పోటీ నెలకొంది.
అసలు విడుదలయ్యేవి మోస్ట్ వెయిటెడ్ మూవీలు కావడంతో డేట్ల దగ్గర ఎలాంటి తేడాలు రాకుండా చూసుకుంటున్నారు దర్శక, నిర్మాతలు.ఇందుకోసం కొన్ని సినిమాల రిలీజ్ డేట్లు కూడా మారుస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ డేట్‌ను ప్రకటించిన ఎఫ్ 3 మూవీ తప్పుకున్న విషయం తెలిసిందే.ఈ మూవీతో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ ను ఛేంజ్ చేస్తున్నట్టు తెలుస్తోందతి.ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఎట్టి పరిస్తితుల్లో సంక్రాంతికే వచ్చి హిట్ కొడుతామని చెప్పిన ఎఫ్ 3 టీమ్ పెద్ద సినిమాల దెబ్బకు రిలీజ్ డేట్ మార్చుకుంది.
కాగా ఆర్ఆర్ఆర్ నుంచే సినిమాల సందడి ప్రారంభం కాబోతోంది.అయితే దీని తర్వాత వరుసగా 12న భీమ్లానాయక్, 13న సర్కారు వారి పాటతో పాటు జనవరి 14న రాధేశ్యామ్ మూవీలు లైనప్ చేసుకుని వెయిట్ చేస్తున్నాయి.
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.పెద్ద సినిమాలన్నీ ఒకేసారి రిలీజ్ అయితే ఎవరికీ కలెక్షన్లు రావనే భావనతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లానాయక్ పోస్ట్ పోన్ అవుతోందని తెలుస్తోంది.అలాగే మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట కూడా రిలీజ్ డేట్‌ను ఛేంజ్ చేసుకున్నట్టు సమాచారం.ఆల్రెడీ సంక్రాంతి సీజన్ మొత్తం పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలతో నిండిపోవడంతో కలెక్షన్లు తగ్గించుకుంటే సమస్యలు వస్తాయని ఇలా ఏప్రిల్ ఎండింగ్ కి డేట్‌ను మారుస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆచార్య మూవీ టీమ్ కూడా డేట్ ఛేంజ్ చేసే ఆలోచనలో ఉందని సమాచారం.