తొలిసారి హనుమాన్ దీక్ష తీసుకున్న వరుణ్ తేజ్.. ఈ హీరోకు మంచి జరగాలంటూ?

టాలీవుడ్ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) గురించి మనందరికీ తెలిసిందే.వరుణ్ తేజ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

 Varun Tej In Hanuman Deeksha And Visited Kondagattu Details, Varun Tej, Tollywoo-TeluguStop.com

కానీ వరుణ్ తేజ్ సరైన సక్సెస్ చూసి చాలా రోజులు అయింది అని చెప్పాలి.ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలో భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొడుతున్నాయి.

సినిమాల రిజల్ట్‌ తో పని లేకుండా డిఫరెంట్‌ కథలతో ముందుకెళ్తున్నారు వరుణ్‌ తేజ్‌.అందులో భాగంగానే ఇప్పుడు మరో సరి కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

Telugu Hanuman Deeksha, Varun Tej, Tollywood, Varuntej-Movie

మేర్లపాక గాంధీ( Merlapaka Gandhi ) దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ నటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.మార్చి నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతోంది.ఇండో కొరియా బ్యాక్‌డ్రాప్‌ లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం దీనికోసం వరుణ్‌ తేజ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నారట.ఫ్రెష్‌ అండ్‌ యూనిక్‌ క్యారెక్టర్‌ లో కనిపించనున్నాడని టీమ్‌ చెబుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా వరుణ్ తేజ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

Telugu Hanuman Deeksha, Varun Tej, Tollywood, Varuntej-Movie

అదేమిటంటే తొలిసారి హనుమాన్‌ దీక్ష( Hanuman Deeksha ) తీసుకున్నారు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌.ఈ మేరకు తాజాగా కొండగట్టు అంజన్నను( Kondagattu Anjanna ) దర్శించుకున్నారు.ఆలయ అధికారులు, అర్చకులు వరుణ్‌ తేజ్‌ కు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్శన అనంతరం శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

కొండగట్టు ఆలయ ప్రాముఖ్యతను వరుణ్‌ తేజ్‌ కు వివరించారు.ఈ సందర్బంగా వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ.

కొండగట్టు అంజన్న చాలా పవర్‌ ఫుల్‌ దేవుడు.మొదటిసారి హనుమాన్‌ దీక్ష తీసుకున్నాను.

అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని తెలిపారు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube