కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. ఈ నటిని గుర్తు పట్టారా?

హీరోయిన్ శ్రద్ధా ఆర్య.( Shraddha Arya ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

 Actress Shraddha Arya Blessed Twins Details, Shraddha Arya, Twins, Heroine Shrad-TeluguStop.com

ఒకప్పుడు తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది శ్రద్ధా.ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం కన్నడ హిందీ పంజాబీ సినిమాలలో నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు నేర్పరచుకుంది.

అన్ని భాషల్లో ఈమెకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది శ్రద్ధా ఆర్య.

Telugu Shraddha Arya, Shraddhaarya, Twins-Movie

ఎప్పటికప్పుడు తనకు తన ఫ్యామిలీకి తన భర్తకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.కాగా 2004 లో టీవీ రియాల్టీ షోలో పాల్గొన్న ఈమె 2006లో కలవనిన్ కదలై అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయింది.ఆ తర్వాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించి మెప్పించింది.గత ఏడాది రిలీజైన హిందీ మూవీ రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది.

వీటితో పాటు పలు సీరియల్స్‌ లో కూడా యాక్ట్ చేసింది.ఇకపోతే ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె 2021 లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగర్ ని( Rahul Nagar ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది అక్టోబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది.

Telugu Shraddha Arya, Shraddhaarya, Twins-Movie

ఇప్పుడు తనకు ఒక అబ్బాయి,అమ్మాయి పుట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంది.శ్రద్ధా ఆర్య కవలలకి( Twins ) జన్మనిచ్చింది.ఈ విషయాన్ని ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది.

నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిన విషయాన్ని బయటపెట్టింది.ఈ మేరకు ఇద్దరు బిడ్డలను చేతిలో పట్టుకుని వారి వైపు చూస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

ఆ ఫోటోని చూసిన అభిమానులు, నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube