ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఇండియా లెవెల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప 2.( Pushpa 2 ) సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా విడుదలకు మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.దాంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.
కాగా ఇప్పటికే 2021 లో పుష్ప 1 మూవీ విడుదల అయ్యి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన పుష్ప 2 మూవీ ఇప్పుడు విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఇకపోతే పుష్ప 3( Pushpa 3 ) కూడా ఉంటుంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా అది నిజం చేస్తూ ఒక ఫొటో బయటకు వచ్చింది.ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్ గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి( Resul Pookutty ) పనిచేశారు.ఆయన తన టీమ్ తో కలిసి దిగిన ఫొటో వెనుక పుష్ప3 టైటిల్ ఉంది.
అందులో పుష్ప3: ది ర్యాంపేజ్( Pushpa 3: The Rampage ) అని ఉండటంతో పార్ట్ 2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.కాగా కొన్ని రోజుల కిందట కూడా పుష్ప3 మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.పార్ట్3 ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ కూడా స్పష్టం చేశారు.పుష్ప 2 సినిమా క్లైమాక్స్ లో పార్ట్ 3 కి సంబంధించి లీడ్ ఇస్తూ కొన్ని సన్నివేశాలను చూపించబోతున్నారట.
మూవీ మేకర్స్ కూడా పుష్ప 3 కచ్చితంగా ఉంటుందని చెబుతున్నాయి.
అయితే రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు.రెండు, మూడేళ్ల తర్వాతే పార్ట్3 సినిమాకి అవకాశం ఉందని చెబుతున్నారు.ఇటు సుకుమార్, అటు అల్లు అర్జున్ కు వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయి.
అవి పూర్తి చేయడానికి కచ్చితంగా రెండేళ్లు కావాల్సిందే.ఆ తర్వాతే పార్ట్3 కి సంబంధించిన పనులు మొదలవుతాయి.
ఈలోగా పుష్ప యూనివర్స్ వివిధ రూపాల్లో వినోదాన్ని పంచుతుందని సమాచారం.తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ పుష్ప వైల్డ్ జాతర ఈవెంట్ లోనూ అభిమానులు దర్శకుడు సుకుమార్ ను పార్ట్ 3 గురించి అడగగా నేను మీ హీరోని మూడేళ్లు కష్టపెట్టాను.
మీరు మీ హీరోని అడగండి.నేను నా ఫ్రెండ్ ను అడుగతాను.
నా కోసం మళ్లీ మరో మూడేళ్లు ఇస్తే తప్పకుండా పుష్ప3 చేస్తా అని సమాధానం ఇచ్చారు.అంటే మూడో భాగం అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు.