బాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న బ్యూటీలలో శ్రద్దా కపూర్( Shraddha Kapoor ) ఒకరు.ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.స్త్రీ2( Stree 2 ) మూవీలో హీరోయిన్ గా నటించడం ఈ బ్యూటీకి క్రేజ్ పరంగా మరింత కలిసిరావడంతో పాటు క్రేజ్ మరింత పెరిగింది.అయితే పుష్ప2( Pushpa 2 ) సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేయడం, అదే సమయంలో నాని సినిమాకు రెమ్యునరేషన్ వల్ల రిజెక్ట్ చేయడంతో శ్రద్ధా కపూర్ పేరు మారుమ్రోగుతోంది.
ఈ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ప్రస్తుతం ఒక సినిమాకు 12 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేసే హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు.
అయితే ఈ బ్యూటీ తాజాగా ఒక ఇల్లు రెంట్( House Rent ) కోసం తీసుకుందని ఆ ఇంటి రెంట్ ఏకంగా నెలకు 6 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.
ఏడాది అడ్వాన్స్ ను ఆమె ముందుగానే చెల్లించిందని ఏకంగా 72 లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చిందని భోగట్టా.శ్రద్ధా కపూర్ తెలుగు సినిమాలకు కావాలనే నో చెబుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అయితే సినిమాలకు సంబంధించి ఆమె మనస్సులో ఏముందో అనే చర్చ సైతం జరుగుతోంది.
శ్రద్ధా కపూర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు.చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ పై దృష్టి పెడుతుండగా శ్రద్దా కపూర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.శ్రద్ధా కపూర్ కెరీర్ పరంగా తప్పటడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
శ్రద్ధా కపూర్ ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.