‘వైల్డ్‌లైఫ్ అన్‌సెన్సర్డ్’ ( Wildlife Uncensored ) అనే ట్విట్టర్ ఖాతాలో డిసెంబర్ 4న పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఒక పంది, కొన్ని మొసళ్లతో పోరాడుతూ తన ప్రాణం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం కనిపించింది.
కేవలం రెండు రోజుల్లోనే ఈ వీడియోను 18 లక్షల మందికి పైగా చూశారు.
ఈ వీడియో మొదట్లో, ఒక చెరువు ఒడ్డున నిలబడి ఉన్న రెండు పందులు కనిపిస్తాయి.
ఆ చెరువులో ఎక్కువ భాగం నీటిలో మునిగి ఉన్న కొన్ని మొసళ్లు కనిపిస్తాయి.వాటిలో ఒక మొసలి, అందులో ఒక పందిని లక్ష్యంగా చేసుకుని, దాని కాలిని బలంగా పట్టుకుంటుంది.
ఈ దృశ్యం చూసిన వారందరూ షాక్ అయ్యారు.
వీడియోలో తన ప్రాణం కాపాడుకోవడానికి పంది ఎంతో కష్టపడుతుంది.కానీ మొసలి దానిని వదలదు.పంది పోరాడుతుండగా, అదే నీటిలోని మరిన్ని మొసళ్లు వచ్చి దాడి చేయడం మొదలుపెట్టాయి.
ఒక సమయంలో పంది తప్పించుకోవడానికి దగ్గరగా వచ్చింది కానీ, మొసళ్లు చాలా వేగంగా ఉన్నాయి.అవి నిరంతరం దాడి చేస్తూ, పందిని నీటిలోకి లాగేస్తాయి.చివరకు మొసళ్లు పందిని కొరికేస్తూ దాన్ని దారుణంగా చంపేశాయి.
ఈ దృశ్యం చూసిన నెటిజన్లు తమ భావోద్వేగాలను కామెంట్‌ల రూపంలో వ్యక్తం చేశారు.ఒక యూజర్ “ప్రకృతి ఎంత క్రూరంగా ఉంటుందో!” అని రాశారు.మరొకరు “ఆ పంది బతికిందా?” అని ఆశ్చర్యపోయారు.ఇంకొకరు “ఇది సహజంగా కనిపించడం లేదు.ఆ పందులను మొసళ్ల కోసం ఆహారంగా వాడారు అనిపిస్తుంది” అని అనుమానించారు.“అడవిలో ఒకటి బతకాలి అంటే మరొకటి చావాల్సిందే, ఈ కఠినమైన పరిస్థితుల వల్ల ఎప్పుడూ అక్కడ హింసే కనిపిస్తుంది.” అని ఇంకొకరు కామెంట్ చేశారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.